వచ్చే సంవత్సరం -2022లో మెగా అభిమానులకు నిజంగా పండగే అని చెప్పవచ్చు.ఎందుకంటే మెగా బ్రదర్స్ ఇద్దరూ ఒక్కొక్కరు మూడేసి చిత్రాలతో ప్రేక్షకులు ముందుకు రానున్నారు.
కొంచెం అటు ఇటుగా అయినా మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రాలు మాత్రం థియేటర్లలో నాన్ స్టాప్‌గా సందడి చేయనున్నట్టు తెలుస్తోంది.అదే నిజమైతే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో నిర్మాతలకు కాసుల వర్షం కురుస్తుంది.
కానీ, చిన్న సినిమా నిర్మాతల మీద మాత్రం భారీ ప్రభావం పడనున్నట్టు తెలుస్తోంది.ఈ విషయం తెలియడంతో మెగా అభిమానులు తెగ సంబురాలు చేసుకుంటున్నారట.
ఇకపోతే మెగాస్టార్ చిరు ఒకే క్యాలెండర్ ఇయర్‌లో 3 సినిమాలు చేసి దాదాపు 20ఏళ్లకు పైగా అవుతుంది.అప్పుడెప్పుడో మృగరాజు, డాడీ, శ్రీమంజునాథ చిత్రాలు 2001 సంవత్సరంలో విడుదలయ్యాయి.
ఆనాడు మూడు చిత్రాలు ఒకే ఏడాదిలో రావడంతో మెగా అభిమానులు పండగ చేసుకున్నారు.నాటి నుంచి నేటి వరకు మెగాస్టార్ చిరు ‘ట్రిపుల్ ధమాకా’ ఇచ్చింది లేదు.
ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కెరీర్‌లో ఇప్పటివరకు ఒకే ఏడాదిలో 3 సినిమాలు విడుదలైన దాఖలాలు లేవు.అయితే, ఇప్పుడు ఆ అవకాశం వచ్చింది.
మెగా బ్రదర్స్ వచ్చే ఏడాది చెరో మూడు చిత్రాలతో ఫ్యాన్స్‌ను అలరించేందుకు వస్తున్నారు.
ఈ చిత్రాలెంటో ఇప్పుడు తెలుసుకుందాం.చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ఆచార్య సినిమా ఫిబ్రవరి 4న థియేటర్స్‌కు వస్తుండగా..
గాడ్ ఫాదర్ మూవీ సమ్మర్ చివరలో విడుదలయ్యే చాన్స్ ఉంది.భోళా శంకర్ చిత్రం కూడా 2022 సెకండ్ హాఫ్‌లో ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు సమాచారం.
ఇకపోతే పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ విషయానికొస్తే.మళయాళం రిమేక్ మూవీ భీమ్లా నాయక్ 2022 జనవరి 12న విడుదలకు సిద్ధం కానుండగా.
హరిహర వీరమల్లు వేసవి కాలంలో ఏప్రిల్ 29న థియేటర్లకు రానుంది.అదేవిధంగా భవదీయుడు.
భగత్ సింగ్ సినిమా వచ్చే ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి.ఇదే నిజమైతే 2022లో మెగా బ్రదర్స్ దెబ్బకు థియేటర్ల ఓనర్లకు, నిర్మాతలకు కాసుల వర్షం కురవడం ఖాయంగా తెలుస్తోంది.