సినిమా ఇండస్ట్రీలో ఒక్కొక్కరి జీవితాల్లో ఒక రకంగా ఉంటాయి ఎందుకంటే ఇక్కడ కొంతమందికి మాత్రమే స్టార్ హోటల్ లో వసతులు పెద్దపెద్ద భవనాల్లో నివాసముండే అదృష్టం ఉంటుంది చాలా మందికి ఆ అదృష్టం దక్కకపోవచ్చు కొంతమందికి ఉన్నప్పటికీ దాన్ని కాపాడుకోలేక ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించడం వల్ల మళ్లీ వాళ్లు యద స్థానానికి రావచ్చు.ఇలాంటి వాళ్లని మనం తరచూ చూస్తూనే ఉంటాం ఎందుకంటే మొదట్లో బాగా సక్సెస్ అయి ఆ తర్వాత పడిపోయి అవకాశాలు లేక చాలా ఇబ్బందులు పడే వాళ్ళ పరిస్థితి మనం చూస్తూ ఉంటాం అయితే అవకాశాలు రాకపోవడంతో అప్పుల పాలు అవ్వడం వల్ల తీవ్ర మనస్తాపానికి గురై సూసైడ్ చేసుకుని చనిపోయిన వారు కూడా చాలామంది ఉన్నారు.
ఏదేమైనా ఇండస్ట్రీ అనేది రంగుల ప్రపంచం అక్కడ డబ్బు ఉన్నోడికి డబ్బు ఎక్కువగా దొరుకుతుంది, పేద వాళ్లు అక్కడ బతకడం కొంచెం కష్టం గానే ఉంటుంది అసలు విషయానికి వస్తే ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న TP రాజలక్ష్మి అనే ఆవిడ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం…
TP రాజలక్ష్మి మద్రాస్ లోని తంజావూరు లో 1911 లో జన్మించింది కొన్ని సంవత్సరాలకి అప్పుడు బాల్య వివాహం జరిపించారు అయితే ఆమెకి పాటలు పాడటం అంటే చాలా ఇష్టం ఉండేది కాని దానికి వల్ల భర్త ఒప్పుకోకపోవడంతో ఆయన నుంచి విడిపోయి బయటికి వచ్చేసి నాటకాల్లో నటిస్తూ వీలైనప్పుడు నాటకాన్ని డైరెక్షన్ కూడా చేస్తూ వచ్చారు అలా సినిమా ఇండస్ట్రీకి వచ్చి సినిమాలో ఒక మంచి హీరోయిన్ గా గుర్తింపు పొందారు.ఆవిడ హీరోయిన్ గానే కాదు పాటలు రాస్తూ ఉంటారు, పాటలు పాడుతూ ఉంటారు రాజలక్ష్మి 1930లో స్టార్ హీరోయిన్ స్టేటస్ ని అందుకున్నారు ఆవిడ తన సహనటుడు అయిన టీవీ సుందరాన్ని తర్వాత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. సౌత్ ఇండియా లోనే సినిమాను డైరెక్ట్ చేసిన మొట్టమొదటి మహిళ ఆవిడే.ఆవిడకి శ్రీ రాజ్యం టాకీస్ పేరుతో ఒక నిర్మాణ సంస్థ కూడా ఉండేది అప్పుడున్న రాజ్య లక్ష్మి పాపులారిటీని బట్టి ఆమె ఉండే స్ట్రీట్ కి రాజారత్నం స్ట్రీట్ అనే పేరు కూడా పెట్టారు.
మొత్తం అక్కడ రాజ్యలక్ష్మి గారివి 12 బిల్డింగులు ఉండేవి.ప్యాలెస్ ను తలపించేలా ఉండే ఒక బిల్డింగ్ లో ఆవిడ నివాసం ఉండేవారు.అయితే ఆవిడ దేశభక్తి ప్రధానంగా తెరకెక్కించిన ఇదియతాయి సినిమాని నిర్మించారు అలాగే ఆ సినిమాలో ఒక ముసలి క్యారెక్టర్ ని కూడా చేసి మంచి గుర్తింపును సాధించారు అయితే అది చూసిన జనాలు అందరూ ఆవిడ వృద్ధురాలు అయిపోయింది ఒకప్పుడు ఉన్న అందం ఇప్పుడు లేదు అని అనుకున్నారు దాంతో ఆవిడకి సినిమాల్లో అవకాశాలు తగ్గిపోయాయి దాంతో జీవనాన్ని కొనసాగించడానికి తన దగ్గర ఉన్న ఆస్తులన్నింటినీ అమ్ముకుంటూ వచ్చారు.
![Telugu Rajalakshmi, Rajalakshmifall-Telugu Stop Exclusive Top Stories Telugu Rajalakshmi, Rajalakshmifall-Telugu Stop Exclusive Top Stories](https://telugustop.com/wp-content/uploads/2021/03/Unknown-facts-about-TP-Rajalakshmi.jpg)
అదే సమయంలో రాజ మహల్ లో రాణి లా ఉన్నారాజలక్ష్మి గారు పేద రాజలక్ష్మి గా మారిపోయారు సరిగ్గా అప్పుడే ఆవిడకి కలియభామని అవార్డు వచ్చింది దాన్ని స్వీకరించడానికి ఒకప్పుడు కార్లలో తిరిగిన తను ఇప్పుడు నడుచుకుంటూ వెళ్లి తీసుకోవడం ఆమెకు ఎందుకో నచ్చలేదు దాంతో తను కన్నీరు కూడా పెట్టుకుంది.ఇవన్నీ పరిస్థితులను చూసి ఆమెకి బిపి పెరగడంతో హార్ట్ ఏ టాక్ వచ్చింది దాంతో అక్కడినుంచి ఆవిడని హాస్పిటల్ కి తీసుకెళ్లారు అయితే తను ఎంతో ఇష్టపడి కట్టుకున్న అన్ని బిల్డింగ్ లని అమ్మేసింది ఒక్క తన కూతురికి గిఫ్ట్ గా ఇచ్చేసిన బిల్డింగు తప్ప అన్ని బిల్డింగ్ లు అమ్మేసింది.
దాంతో రాజలక్ష్మి తన కూతురు తో ఈ బిల్డింగ్ మాత్రం ఎప్పుడూ అమ్మకు నా గుర్తుగా బిల్డింగ్ ని ఉంచుకో అని చెప్పేదట.
కానీ రాజలక్ష్మి గారి హాస్పటల్ కు అయ్యే ఖర్చు భరించలేక ఆ బిల్డింగ్ ని కూడా అమ్మేశారు.ఆ బిల్డింగ్ ని అమ్మిన తరువాత ఆవిడ కి మత్తు ఇంజక్షన్ ఇచ్చి ఒక అద్దె ఇంట్లోకి తీసుకెళ్లి అక్కడ ఉంచారు ఆ రూము ని చూసిన తను ఇది నా ఇల్లు కాదే అని అనడంతో ఆ రూము బాగా లేదని మిమ్మల్ని ఇక్కడికి మార్చాం అని చెప్పడంతో తను కూడా ఓకే అని అనుకుంది కానీ ఆమె చనిపోయేంత వరకు కూడా ఆవిడకి ఆ బిల్డింగ్ అమ్మిన విషయం తెలియదు చివరి స్టేజ్ లో అద్దె ఇంట్లో ఉంటూ1964లో ఆవిడ మరణించారు.
ఇలా ఒకప్పుడు గొప్పగా బతికిన ఆవిడ చివరి జీవితం మాత్రం ఇలా బ్రతకడం అనేది చాలా ఘోరమైన విషయం అని చెప్పాలి.