ఉప్పెన సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకొని కుర్రాళ్ళ హృదయాలను దోచుకున్న ముద్దుగుమ్మ కృతి శెట్టి.ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ గా మారి స్టార్ హీరోల దృష్టిలో కూడా పడింది.
అతి తక్కువ సమయంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంది.తన అందంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది.
ఇదిలా ఉంటే ప్రస్తుతం వరుస సినిమాలతో బాగా బిజీగా ఉంది.అంతేకాకుండా ఇప్పుడు తన క్రేజ్ మాత్రం తార స్థాయిలో ఉందని చెప్పవచ్చు.
సినీ ఇండస్ట్రీకి బుల్లితెరపై బాలనటిగా అడుగుపెట్టి ఎన్నో వాణిజ్య ప్రకటనలలో నటించింది కృతి శెట్టి.దీంతో ఈ అమ్మడి క్రేజ్ ఏకంగా హీరోయిన్ వరకు సంపాదించుకుంది.
అంతేకాకుండా కొన్ని సీరియల్ ప్రకటనలో, జువెలరీ ప్రకటనలో కూడా చేస్తూ మరింత డిమాండ్ సంపాదించుకుంది.ఇటీవలే తన చేతుల మీదుగా ఓ బుల్లితెర సీరియల్ కూడా ప్రారంభమయ్యింది.
ప్రస్తుతం కృతి శెట్టి ఓ వైపు సినిమాలే కాకుండా మరో వైపు ప్రకటనలో కూడా బాగా దూసుకుపోతుంది.
అమెరికాలో ఓ జువెలరీ షాప్ లో యాడ్ లో నటించడానికి పాతిక లక్షల వరకు పారితోషకం అందుకుంటుందని తెలిసింది.
ప్రస్తుతం ఈ యాడ్ యూ ట్యూబ్ లో వైరల్ గా మారింది.అందులో కృతిశెట్టి నిండా నగలతో అందంగా కనిపిస్తుంది.మొత్తానికి కృతిశెట్టి సినిమాలతో పాటు ప్రకటనలతో కూడా బాగా సంపాదిస్తుంది.కృతి శెట్టి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉండగా అందులో లింగు స్వామి దర్శకత్వంలో యంగ్ హీరో రామ్ నటిస్తున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.
ఈ సినిమా కూడా ప్రస్తుతం షూటింగ్ బిజీలో ఉంది.అంతేకాకుండా నాచురల్ స్టార్ హీరో నాని నటిస్తున్న శ్యామ్ సింగరయ్ సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తుంది.
ఇక ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగా ప్రస్తుతం ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.ఇక వీటితో పాటు మరో యంగ్ హీరో సుధీర్ బాబు నటిస్తున్న ఆ అమ్మాయి గురించి చెప్పాలని ఉంది అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ బిజీలో ఉంది.మొత్తానికి వరుస సినిమాలో స్టార్ హీరోల సరసన బాగా బీజీగా మారింది.
ఉప్పెన సినిమాతో మంచి క్రేజ్ అందుకున్న ఈ బ్యూటీ ఈ వరుస సినిమాలతో ఎటువంటి సక్సెస్ ని అందుకుంటుందో చూడాలి.అంతేకాకుండా రెమ్యూనరేషన్ విషయంలో కూడా ఈ అమ్మడు అతి తక్కువ సమయంలో కోటి రూపాయల పారితోషకం అందుకుంటుంది.ఇక ఈ సినిమాల తర్వాత ఈ అమ్మడు తన పారితోషికం ను మరింత పెంచుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.మొత్తానికి తారా స్థాయిలో ఓ రేంజ్ లో దూసుకుపోతున్న కృతి శెట్టి ని చూసి తన అభిమానులు ఈ క్రేజ్ ఏంటండి బాబు అంటూ తెగ కామెంట్స్ రూపంలో పొగుడుతున్నారు.