ఈ సింపుల్ రెమెడీని పాటిస్తే రెండు వారాల్లో చర్మం తెల్లగా మెరుస్తుంది!

సాధారణంగా బాడీ తో పోలిస్తే కొందరి ముఖ చర్మం నల్లగా ఉంటుంది.ఎండల ప్రభావం, రసాయనాలు అధికంగా ఉండే మేకప్ ఉత్పత్తులను వాడటం, మేకతో నిద్రించడం, మృత కణాలు పేరుకుపోవడం తదితర కారణాల వల్ల ముఖ చర్మం యొక్క రంగు తగ్గుతుంది.

 Follow This Simple Remedy And Your Skin Will Glow White In Two Weeks , Skin Whit-TeluguStop.com

దాంతో మార్కెట్లో లభ్యమయ్యే ఖరీదైన స్క్రీన్ వైట్నింగ్ క్రీమ్, సీరం వంటి ఉత్పత్తులను కొనుగోలు చేసి వాడుతుంటారు.అయితే వాటి వల్ల ఎంత ప్రయోజనం ఉంటుంది అన్నది పక్కన పెడితే ఇప్పుడు చెప్పబోయే సింపుల్ రెమెడీ మాత్రం రెండు వారాల్లోనే చర్మాన్ని తెల్లగా మెరిపిస్తుంది.

మరి ఇంతకీ ఆ రెమెడీ ఏంటి అనేది ఏం మాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక మీడియం సైజ్ బీట్ రూట్ తీసుకుని పీల్‌ తొలగించి నీటిలో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

అలాగే రెండు స్ట్రాబెర్రీలను తీసుకుని వాటర్ లో కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఆ తర్వాత బ్లెండర్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న బీట్ రూట్ ముక్కలు, స్ట్రాబెర్రీ ముక్కలు, ఒక కప్పు వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో వన్ టేబుల్ స్పూన్ వెజిటేబుల్ గ్లిజరిన్, నాలుగు నుంచి ఐదు చుక్కలు ఆరెంజ్ ఎసెన్షియల్ ఆయిల్ వేసుకుని బాగా కలపాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఐస్ ట్రేలో నింపుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి.ఈ ఐస్ క్యూబ్స్ ను రోజుకు ఒకటి లేదా రెండు చొప్పున తీసుకుని ముఖానికి అప్లై చేసుకోవాలి.

పూర్తిగా డ్రై అయిన అనంతరం చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.ఇలా చేస్తే కేవలం రెండు వారాల్లోనే చర్మం తెల్లగా మారడం ప్రారంభమవుతుంది.అలాగే ఓపెన్ పోర్స్ క్లోజ్ అవుతాయి.

ఆయిలీ స్కిన్ సమస్య నుంచి విముక్తి లభిస్తుంది.మొటిమలు, వాటి తాలూకు మచ్చలు సైతం క్రమంగా మాయమవుతాయి.

కాబట్టి స్కిన్ వైట్నింగ్ కోసం ప్రయత్నించేవారు తప్పకుండా ఈ సింపుల్ రెమెడీని పాటించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube