న్యూస్ రౌండప్ టాప్ 20

1.లోకేష్ కు సవాల్

Telugu Ap Cm Jagan, Gold, Jagan, Janasenani, Pavan Kalyan, Telangana, Telugu, To

ఏపీలో అభివృద్ధిపై దమ్ముంటే చర్చకు రావాలని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు వైసీపీ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సవాల్ చేశారు.

 Telangana Headlines, News Roundup, Top20news, Telugu News Headlines, Gold Rate,-TeluguStop.com

2.తెలంగాణకు జేపీ నడ్డా

రేపు తెలంగాణకు బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రానున్నారు.

3.కిషన్ రెడ్డి, ఈటెల ,రాజగోపాల్  హై కమాండ్ పిలుపు

Telugu Ap Cm Jagan, Gold, Jagan, Janasenani, Pavan Kalyan, Telangana, Telugu, To

తెలంగాణలో బిజెపి పరిస్థితి చక్కదిద్దేందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ని బిజెపి అధిష్టానం ఢిల్లీకి పిలిపించింది.

4.నేడు బెజవాడలో జగన్నాథ రథయాత్ర

విజయవాడలో నేడు ఇస్కాన్ జగన్నాథ రథయాత్ర నిర్వహించనున్నట్లు ఇస్కాన్ మందిర అధ్యక్షులు చక్రధారి దాస్ వెల్లడించారు.

5.నేడు హరిదీప్ సింగ్ తో కేటిఆర్ భేటీ

Telugu Ap Cm Jagan, Gold, Jagan, Janasenani, Pavan Kalyan, Telangana, Telugu, To

కేంద్ర మంత్రి హరీదీప్ సింగ్ పూరితో తెలంగాణ మంత్రి కేటీఆర్ సమావేశం కానున్నారు.

6.తిరుమల సమాచారం

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం పడుతుంది.

7.తెలంగాణలో భారీ వర్షాలు

Telugu Ap Cm Jagan, Gold, Jagan, Janasenani, Pavan Kalyan, Telangana, Telugu, To

తెలంగాణలో నేడు , రేపు అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

8.శ్రీవారి దర్శన టికెట్లు విడుదల

నేడు సెప్టెంబర్ నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి దర్శనం టికెట్లు ను టీటీడీ విడుదల చేయనుంది.300 టికెట్ల కోటాను విడుదల చేయనున్నారు.

9.నేడు అఖిలపక్ష సమావేశం

Telugu Ap Cm Jagan, Gold, Jagan, Janasenani, Pavan Kalyan, Telangana, Telugu, To

నేడు అఖిలపక్ష సమావేశంకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు.మణిపూర్ పరిస్థితులపై అఖిల్ పక్షంలో చర్చించనున్నారు.

10.అందుబాటులో గ్రూప్ 4 హాల్ టికెట్లు

నేటి నుంచి గ్రూప్ 4 హాల్ టికెట్లు అందుబాటులోకి రానున్నాయి.

11.విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం

విజయవాడలో నేడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉపా కేసులు రద్దు చేయాలని కోరుతూ రౌండ్ టేబుల్ సమావేశం జరగనుంది.

12.బట్టి విక్రమార్క పాదయాత్ర

Telugu Ap Cm Jagan, Gold, Jagan, Janasenani, Pavan Kalyan, Telangana, Telugu, To

సీఎల్పీ నేత బట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర నేటికి 101వ రోజుకు చేరుకుంది.నకిరేకల్ నియోజకవర్గం కేతేపల్లి మండలం కొప్పోలు గ్రామం నుండి ఈ యాత్ర ప్రారంభమైంది.

13.గ్రూప్ 4 పరీక్షకు వేలిముద్రతో హాజరు

గ్రూప్ 4 పరీక్షకు వేలిముద్రలతో హాజరు తీసుకోవాలని తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్ణయించింది.

14.నో బ్యాక్ డే కు ఆదేశం

స్కూల్ పిల్లల పుస్తకాల భారాన్ని తగ్గించేందుకు తెలంగాణలో నో బ్యాగ్ డే అనే కొత్త కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టింది.ప్రతి నెల నాలుగో శనివారం నో బ్యాక్ డే ను అమలు చేయాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది.

15.షర్మిల కామెంట్స్

Telugu Ap Cm Jagan, Gold, Jagan, Janasenani, Pavan Kalyan, Telangana, Telugu, To

చివరి శ్వాస వరకు తాను తెలంగాణ బిడ్డగా తెలంగాణ కోసం పోరాడుతూనే ఉంటానని వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు.

16  జనసేనకు గాజు గ్లాసు గుర్తు కొనసాగింపు

జనసేన పార్టీకి గాదు గ్లాసు గుర్తు కొనసాగిస్తూ ఏపీ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది.

17.తిరుమలలో బోనులో చిక్కిన చిరుత

Telugu Ap Cm Jagan, Gold, Jagan, Janasenani, Pavan Kalyan, Telangana, Telugu, To

అలిపిరి నడక మార్గంలో ఏడో మైలురాయి వద్ద మూడేళ్ల బాలుడు పై గురువారం దాడి చేసిన చిరుత ఎట్టకేలకు బోనులో చిక్కింది.

18.కొత్త సబ్  డిస్ట్రిక్ట్ ల ఏర్పాటుపై ప్రభుత్వం నోటిఫికేషన్

భూముల రీ సర్వే అనంతరం పాలన పౌర సేవలు రిజిస్ట్రేషన్ వేగవంతం చేపట్టేలా కొన్ని జిల్లాల్లో కొత్త సబ్ డిస్ట్రిక్ట్ లను ఏర్పాటు చేస్తూ ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.

19.వారాహి యాత్ర

Telugu Ap Cm Jagan, Gold, Jagan, Janasenani, Pavan Kalyan, Telangana, Telugu, To

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు కోనసీమ జిల్లా మలికిపురం లో పర్యటించాల్సి ఉంది అయితే వర్షం కారణంగా ఈరోజు పర్యటనను వాయిదా వేసుకున్నారు.

20.ఇంటర్మీడియట్ కు టోఫెల్ పరీక్ష

టోటల్ పరీక్షలను ఇంటర్మీడియట్ వరకు విస్తరించాలని ఏపీ సీఎం జగన్ ఆదేశించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube