మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) వరుసపెట్టి విజయాలు సాధిస్తున్న సంగతి తెలిసిందే.గత ఏడాది “గాడ్ ఫాదర్” ( Godfather )ఈ ఏడాది సంక్రాంతి పండుగకు “వాల్తేరు వీరయ్య” రెండు సినిమాలతో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రెండు బ్లాక్ బస్టర్ లు తన ఖాతాలో వేసుకోవడం జరిగింది.
ఈ క్రమంలో తాజాగా ఇప్పుడు మెహర్ రమేష్( Meher Ramesh ) దర్శకత్వంలో చేసిన “భోళా శంకర్” సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద సత్తా చాటడానికి చిరంజీవి రెడీ అయ్యారు.కొద్ది నిమిషాల క్రితం ఈ సినిమా టీజర్ విడుదల చేయడం జరిగింది.
టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టైలిష్ మేకింగ్ దర్శకుడిగా పేరొందిన మెహర్ రమేష్.“భోళా శంకర్”లో( Bhola Shankar ) చిరంజీవిని చాలా స్టైలిష్ లుక్ లో చూపించడం జరిగింది.“స్టేట్ డివైడైన అందరూ నావాళ్లే… నాకు హద్దులు లేవు… సరిహద్దులు లేవు” అంటూ టీజర్ లో చిరంజీవి చెప్పిన డైలాగ్ చాలా హైలెట్ గా నిలిచింది.టీజర్ లో హీరోయిన్ తమన్నా, కీర్తి సురేష్ తో పాటు అక్కినేని సుశాంత్ లను మిగతా ప్రధాన పాత్రలను చూపించడం జరిగింది.
ఆగస్టు 11వ తారీకు సినిమా విడుదల చేస్తున్నట్లు తెలియజేయడం జరిగింది.దీంతో మెగా అభిమానులు “భోళా శంకర్”తో బాక్సాఫీస్ వద్ద హ్యాట్రిక్ విజయం అందుకోవాలని ఆశిస్తున్నారు.







