పసుపు పొడి కంటే పచ్చి పసుపు ఎందుకు మంచిది.. దాని ప్రయోజనాలు ఏంటి..?

దాదాపు ప్రతి ఒక్కరి ఇంట్లో నిత్యం పసుపును వాడుతుంటారు.పసుపు లేకుండా వంటలు చేయరు.

 Why Is Raw Turmeric Better Than Turmeric Powder Raw Turmeric, Raw Turmeric Benef-TeluguStop.com

అయితే సాధారణ పసుపు పొడి( Turmeric powder ) కంటే పచ్చి పసుపు ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు.అందుకు కారణాలు ఏంటి.? అసలు వచ్చి పసుపు వల్ల ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చు.? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.పసుపును గోల్డెన్ స్పైస్ అని పిలుస్తుంటారు.ఎందుకంటే పసుపులో ఎన్నో ఔషధ గుణాలు( Medicinal properties ) నిండి ఉంటాయి.అవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

అయితే పసుపు పొడితో పోలిస్తే పచ్చి పసుపు వల్ల ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి.

పచ్చి పసుపులో కర్కుమిన్( Curcumin ) సాంద్రత అధికంగా ఉంటుంది.ఇది యాంటీ ఆక్సిడెంట్స్‌ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలకు బాధ్యత వహించే క్రియాశీల సమ్మేళనం.

పచ్చి పసుపును పొడిగా మార్చినప్పుడు కర్కుమిన్ స్థాయిలు తగ్గుతాయి.అలాగే పచ్చి పసుపులో విటమిన్లు, మినరల్స్ మరియు ముఖ్యమైన నూనెలతో సహా విస్తృతమైన పోషకాలు మెండుగా నిండి ఉంటాయి.

పొడిగా ప్రాసెస్ చేయడం వల్ల దానిలో పోషకాలు తగ్గే అవకాశాలు ఉంటాయి.

Telugu Tips, Latest, Raw Turmeric, Rawturmeric, Turmeric, Turmeric Powder-Telugu

పసుపు పొడితో పోలిస్తే పచ్చి పసుపు రుచి వాసన చాలా మెరుగ్గా ఉంటుంది.పచ్చి పసుపు మరింత సుగంధ అనుభవాన్ని అందిస్తుంది.వంటల రుచిని పెంచుతుంది.

పచ్చి పసుపులో సహజ యాంటీ ఆక్సిడెంట్లు( Antioxidants ) పుష్కలంగా ఉంటాయి.పసుపును ఎండబెట్టి పొడి చేసే క్రమంలో యాంటీ ఆక్సిడెంట్స్ తగ్గుతాయి.

అందుకే పసుపు పొడితో పోలిస్తే పచ్చి పసుపు ఎక్కువ మంచిదని నిపుణులు చెబుతున్నారు.

Telugu Tips, Latest, Raw Turmeric, Rawturmeric, Turmeric, Turmeric Powder-Telugu

ఇక పచ్చి పసుపును తరచూ తీసుకోవడం వల్ల చాలా ఆరోగ్య లాభాలు ఉన్నాయి.పచ్చి పసుపు వేసి మరిగించిన పాలు లేదా వాటర్ నిత్యం కనుక తీసుకుంటే మెదడు చాలా వేగంగా పనిచేస్తుంది.జ్ఞాపకశక్తి, ఆలోచనాశక్తి పెరుగుతాయి.

క్యాన్సర్ వచ్చే రిస్క్ తగ్గుతుంది.వెయిట్ లాస్ అవుతారు.

కొలెస్ట్రాల్ కరిగి గుండె ఆరోగ్యంగా మారుతుంది.పచ్చి పసుపు మోకాళ్ళ నొప్పులను తరిమికొడుతుంది.

ఫంగల్, వైరల్ ఇన్ఫెక్షన్ల నుంచి మనల్ని రక్షిస్తుంది.అంతేకాదు పచ్చి పసుపును తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.

జీర్ణ క్రియ సైతం చురుగ్గా మారుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube