అమెరికాలో ఘోర ప్రమాదం : పల్టీలు కొడుతూ, చెట్టుపై ఇరుక్కుపోయిన కారు .. ముగ్గురు భారతీయుల దుర్మరణం

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం( Road Accident ) చోటు చేసుకుంది.ఈ ఘటనలో ముగ్గురు భారతీయ మహిళలు దుర్మరణం పాలైనట్లుగా వార్తలు వస్తున్నాయి.

 Three Indians Killed In Horrific Us Car Accident Details, Three Indians Killed ,-TeluguStop.com

సౌత్ కరోలినా రాష్ట్రంలోని గ్రీన్‌విల్లె కౌంటీలో( Greenville County ) ఈ ప్రమాదం చోటు చేసుకుంది.మృతులను గుజరాత్‌లోని ఆనంద్ జిల్లాకు చెందిన రేఖాబెన్ పటేల్, ( Rekhaben Patel ) సంగీతాబెన్ పటేల్,( Sangitaben Patel ) మనీశాబెన్ పటేల్‌లుగా( Manishaben Patel ) గుర్తించారు.

వీరు ప్రయాణిస్తున్న ఎస్‌యూవీ అతివేగంగా వంతెనపైకి దూసుకెళ్లింది.అనంతరం 20 అడుగుల గాల్లోకి దూసుకెళ్లి పల్టీలు కొడుతూ చెట్టును ఢీకొట్టి ఆగిపోయింది.

Telugu Rekhaben Patel, Carolina, Indian, Indians, Car-Telugu NRI

అతివేగమే ప్రమాదానికి కారణంగా పోలీసులు భావిస్తున్నారు.వీరు ప్రయాణించిన కారు చెట్టులో ఇరుక్కుపోయి నుజ్జునుజ్జు అయ్యింది.కారులో వున్న డిటెక్షన్ సిస్టమ్ ద్వారా .ప్రమాదానికి సంబంధించిన సమాచారం బాధిత మహిళల కుటుంబ సభ్యులకు వెళ్లింది.దీంతో వారు వెంటనే సౌత్ కరోలినా పోలీసులను( South Carolina Police ) అలర్ట్ చేశారు.హుటాహుటిన రంగంలోకి దిగిన ఎమర్జెన్సీ రెస్పాన్సీ టీమ్, సౌత్ కరోలినా హైవే పెట్రోల్ ఫైర్ అండ్ రెస్క్యూ టీమ్ , ఈఎంఎస్ యూనిట్స్ ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి.

ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో నలుగురు వున్నట్లుగా తెలుస్తోంది.ముగ్గురు మహిళలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా .నాలుగో వ్యక్తిని అధికారులు రక్షించి ఆసుపత్రికి తరలించారు.

Telugu Rekhaben Patel, Carolina, Indian, Indians, Car-Telugu NRI

కాగా.కొద్దిరోజుల క్రితం అమెరికాలోనే జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలంగాణ విద్యార్ధులు దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే.మృతులను నివేశ్ , గౌతమ్ కుమార్‌గా గుర్తించారు.

గత శనివారం రాత్రి వీరిద్దరూ తమ మిత్రులతో కలిసి కారులో యూనివర్సిటీ నుంచి ఇంటికి వస్తుండగా గుర్తు తెలియని వాహనం వీరి కారును ఢీకట్టింది.ఈ ఘటనలో నివేశ్, గౌతమ్‌లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.

మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.మృతులిద్దరూ అరిజోనా స్టేట్ యూనివర్సిటీలో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు.

వీరి మరణవార్తతో భారత్‌లోని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube