మనుషులలో నిస్వార్థం ఉంటుందేమో కానీ జంతువులలో ఈ అవలక్షణం ఏకోణానా కనిపించదు.యజమాని పట్ల మూగ జంతువులు ఎంతో విధేయతను, విశ్వసనీయతను కనబరుస్తాయి.
అలాగే అన్‌కండీషనల్ లవ్ కురిపిస్తాయి.తాజాగా ఒక గాడిద( Donkey ) తనతో స్నేహం చేస్తున్న యువతి పట్ల ఎంతో ప్రేమను చూపించింది.
పేరుతో పిలవగానే అది ఉరుకుల పరుగులు తీస్తూ ఆ యువతి వద్దకు వచ్చింది.దానికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ గా మారింది.
యువతిని చూసి చాలా సంతోషించిన గాడిదను మనం వీడియోలో చూడవచ్చు.ఆ యువతి గాడిదను హెన్రీ ( Henry ) అని పిలుస్తుంది.గాడిద ఆమె వద్దకు పరిగెత్తడం కూడా చూడవచ్చు.గాడిద చాలా ముద్దుగా, అమాయకంగా కనిపిస్తుంది.యువతి గాడిదకి నచ్చిన ఆహారాన్ని( Food ) ఇస్తుంది.ఇందులో యాపిల్స్, ఓట్స్ ఉన్నాయి.
ఆ వీడియోను షేర్ చేసిన వ్యక్తి.మహిళ, గాడిద ఒకరినొకరు ప్రేమను చూపించుకుంటున్నాయని చెప్పాడు.
ప్రేమ ( Love ) అనేది ప్రతి జంతువు చూపిస్తుందని ఇంకొందరు పేర్కొన్నారు.చాలా మంది ఈ వీడియోను లైక్ చేసారు, ఈ అనుబంధం గురించి పాజిటివ్ కామెంట్స్ పెట్టారు.ఈ వీడియో తమకు మంచి అనుభూతిని కలిగించిందని, గాడిద నవ్వుతూ ఉందని ఒకరు కామెంట్ పెట్టారు.
గాడిద, యువతి ఒకరికొకరు సపోర్టుగా ఉండటం చాలా అదృష్టమని ఇంకొకరు అన్నారు.
ప్రపంచం ఎంత అందంగా ఉందో చూపేందుకు భగవంతుడు ఎన్నో జీవులను సృష్టించాడని మరికొందరు వ్యాఖ్యానించారు.దీనికి ముందు గాడిద వీడియో మరొకటి వైరల్ అయింది.ఈ వీడియోలో క్రిస్మస్ పండుగ సందర్భంగా ఒక గాడిద కొత్త బంతిని బహుమతిగా అందుకుంది.