పెళ్లయి పిల్లలు ఉంటే ఇంట్లోనే ఉండాలా... వారికి గట్టి కౌంటర్ ఇచ్చిన అనసూయ?

అనసూయ భరద్వాజ్( Anasuya Bhardwaj ) పరిచయం అవసరంలేని పేరు జబర్దస్త్( Jabardasth ) యాంకర్ గా అందరికీ ఎంతో సుపరిచితం అయినటువంటి ఈమె ప్రస్తుతం వెండితెర నటిగా వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీ అవుతున్నారు.ఇలా నటిగా పాన్ ఇండియా సినిమాలలో అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతున్నటువంటి అనసూయ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.

 Anasuya Latest Post Goes Viral In Social Media , Anasuya, Tollywood Actress,marr-TeluguStop.com

అయితే అనసూయ పట్ల సోషల్ మీడియాలో చాలామంది విమర్శలు చేస్తూ ఉంటారు పెళ్లయింది కదా పిల్లలతో భర్తతో చక్కగా ఉండకోకుండా ఇలాంటి వేషాలు ఏంటి అంటూ పలువురు కామెంట్లు చేస్తారు పెళ్లయిన తర్వాత కూడా ఇలా ఎక్స్పోజ్ చేయడం ఏంటి అంటూ చాలామంది ఈమె పట్ల విమర్శలు చేశారు.అయితే తన గురించి ఇలాంటి విమర్శలు చేసిన వారికి అనసూయ తన స్టైల్ లోనే గట్టి సమాధానం చెబుతూ ఉంటారు.

ఈ విధంగా ఈమె సోషల్ మీడియా వేదికగా ఎలాంటి చిన్న పోస్ట్ చేసిన కూడా పెద్ద ఎత్తున అది వైరల్ అవుతూ ఉంటుంది.అయితే పెళ్లయింది కదా పిల్లలు ఉన్నారు కదా ఇంట్లో ఉండిపోకుండా ఇలా ఏంటి అని చాలామంది అందరిని ప్రశ్నిస్తూ ఉంటారు అలాంటివారికి ఈమె ఇటీవల సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని షేర్ చేస్తూ చెప్పినటువంటి సమాధానం వైరల్ గా మారింది.

Telugu Anasuya, Anasuya Latest, Anchor, Married Womens-Movie

ఇన్‌స్ట్రామ్‌లో ఆమె ఓ వీడియోని పంచుకుంది.ఇందులో 60ఏళ్ల మహిళ అందాల పోటీల్లో టైటిల్ ని గెలుచుకుంది.ఆమె ఎంతో మంది మహిళలకు స్పూర్తిగా నిలుస్తుంది.ఈ వీడియో వైరల్‌ అవుతుంది.ఇక ఈ వీడియోని ఉద్దేశించి అనసూయ ఒక కామెంట్ కూడా చేశారు.ఈ వీడియో ఎంతో మందికి సమాధానం అని తెలిపింది.

ఇలానే సమాధానం చెబుతూ ఉండాలని పేర్కొంది.సెక్సీస్ట్ లు, బాడీ షేమింగ్ కామెంట్లు చేసే వారిని ఉద్దేశించి అనసూయ ఈ కామెంట్ చేశారని తెలుస్తుంది.

Telugu Anasuya, Anasuya Latest, Anchor, Married Womens-Movie

ఆడవాళ్లకి పెళ్లైందని, పిల్లలున్నారుగా, 30ఏళ్లు దాటాయిగా, ఇంట్లో నుంచి బయటకు వెళ్లి ఏం చేస్తారు, ఇంట్లో ఉండొచ్చుగా అని మహిళలను ఉద్దేశించి కామెంట్లు చేసే వారికి ఇలానే సమాధానం చెప్పాలని అనసూయ కామెంట్‌ చేయడం విశేషం.ప్రస్తుతం ఆ వీడియోతోపాటు అనసూయ కామెంట్ పోస్ట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది మరి ఇలాంటి కామెంట్స్ చేసిన అనసూయ ముందు ముందు ఇది ఎలాంటి వివాదాలకు కారణమవుతుందో తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube