కేంద్రంలో కాంగ్రెస్ వచ్చేది లేదు.. సచ్చేది లేదు..: కేటీఆర్

కాంగ్రెస్ పార్టీకి( Congress Party ) రానున్న లోక్‎సభ ఎన్నికల్లో గడ్డుకాలమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( KTR ) అన్నారు.కేంద్రంలో కాంగ్రెస్ వచ్చేది లేదు.

 Congress Will Not Come To The Center There Will Be No Success Ktr Details, Congr-TeluguStop.com

సచ్చేది లేదని విమర్శించారు.సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) వైఖరి మైనార్టీలకు వ్యతిరేకంగా ఉందని కేటీఆర్ తెలిపారు.

రేవంత్ రెడ్డి కేబినెట్ లో ఒక్క మైనార్టీ మంత్రి( Minority Minister ) కూడా లేరని చెప్పారు.రేవంత్ రెడ్డి బీజేపీలో చేరుతారన్న తన వ్యాఖ్యలపై ఎలాంటి స్పందన లేదని పేర్కొన్నారు.

కడియం శ్రీహరి చేసిన ద్రోహం వరంగల్ ప్రజలకు ఒక గాయమన్నారు.

కాకతీయ తోరణాన్ని అవమానించిన రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

అటు తెలంగాణ పుట్టుకను మోదీ అవమానించారని మండిపడ్డారు.పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ కు ప్రజలు బుద్ది చెప్తారని తెలిపారు.

ఈ సారి మోదీకి 200 నుంచి 220 సీట్లు దాటవని పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కు పది నుంచి 12 సీట్లు ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

లోక్ సభ ఎన్నికల తరువాత తెలంగాణలో పెద్ద మార్పులు ఉంటాయన్నారు.తమకున్న సమాచారం మేరకు ఏపీలో జగన్ గెలవబోతున్నారని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube