ఏపీలో మరో పదహారు రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి.దీంతో ప్రధాన పార్టీల నేతలు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు.2024 ఎన్నికలను వైసీపీ అధినేత సీఎం జగన్( CM Jagan ) చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది.దాదాపు ఏడాది నుండి ఎమ్మెల్యేలను.
మంత్రులను నిత్యం ప్రజలలో ఉంచుతూ జరిగిన మంచిని ప్రతి ఇంటికి తెలియజేయడం జరిగింది.అదే సమయంలో నేతల పనితీరుపై సర్వేలు చేసుకుని వాటి ఫలితాలు ఆధారంగా.
అభ్యర్థులను ఖరారు చేశారు.అనంతరం సిద్ధం, మేమంతా సిద్ధం పేరిట ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
మొన్నటిదాకా బస్సు యాత్రలో.జగన్ బిజీగా గడిపారు.
అనంతరం నామినేషన్ వేసి తర్వాత శనివారం వైసీపీ మేనిఫెస్టో ( YCP Manifesto )విడుదల చేయడం జరిగింది.ఇదిలా ఉంటే ఏపీ మలివిడత ఎన్నికల ప్రచార పర్వంలో భాగంగా సీఎం జగన్ రేపు మూడు నియోజకవర్గాల్లో జరిగే బహిరంగ సభల్లో పాల్గొననున్నారు.ఉదయం 10 గంటలకు తాడిపత్రిలో( Tadipatri ) జరిగే సభ ద్వారా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్న ఆయన.ఆ తర్వాత వెంకటగిరిలో త్రిభువని సర్కిల్ లో జరిగే సభలో, అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని కందుకూరులో కేఎంసీ సర్కిల్ లో జరిగే ప్రచార సభలో పాల్గొంటారు.ఎలక్షన్ ముందు వరకు నిత్యం ప్రజలలో ఉండే విధంగా.జగన్ ఎన్నికల ప్రచారం షెడ్యూల్ వైసీపీ పెద్దలు రెడీ చేయడం జరిగింది.