అప్పుడు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోవాలనుకున్నా.. కానీ : గతాన్ని గుర్తుచేసుకున్న జో బైడెన్

తాను ఒకప్పుడు ఆత్మహత్య చేసుకుని చనిపోవాలని అనుకున్నట్లుగా సంచలన వ్యాఖ్యలు చేశారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.

( US President Joe Biden ) అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ ఛానెల్‌కు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు.

ఈ సందర్భంగా బైడెన్ మాట్లాడుతూ.తనకు ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు వచ్చినట్లు తెలిపారు.

రాజకీయాల్లోకి వచ్చిన కొత్తల్లో 1972లో తొలిసారిగా సెనేటర్‌గా గెలుపొందిన కొన్నిరోజులకు బైడెన్ భార్య నీలియా,( Neilia ) 18 నెలల తన చిన్నారి కూతురు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారని గుర్తుచేసుకున్నారు.

ఆ సమయంలో కుంగిపోయిన తాను .తాగటం అలవాటు లేని తాను మందు బాటిల్ తీసుకుని డెలావేర్ మెమోరియల్ బ్రిడ్జి( Delaware Memorial Bridge ) వద్దకు వెళ్లి పీకలదాకా తాగానని బైడెన్ తెలిపారు.ఆ సమయంలోనే వంతెనపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నానని.

Advertisement

కానీ తన మిగిలిన ఇద్దరు పిల్లలు గుర్తొచ్చి ఆ ఆలోచన విరమించుకున్నానని అమెరికా అధ్యక్షుడు వెల్లడించారు.కష్టాలు వచ్చినప్పుడు ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనలు చేయాల్సిన అవసరం లేదని బైడెన్ సూచించారు.

ప్రస్తుతం అధ్యక్షుడి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరోవైపు.ఈసారి అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ - బైడెన్‌లు మరోసారి తలపడుతున్నారు.ఈ సందర్భంగా ట్రంప్‌తో( Trump ) పోటీపైనా అధ్యక్షుడు కీలక వ్యాఖ్యలు చేశారు.

ఎక్కడైనా ట్రంప్‌తో చర్చా కార్యక్రమంలో పాల్గొనడం సంతోషమేనని చెప్పారు.ఇక అధ్యక్ష ఎన్నికల సందర్భంగా డిబేట్లకు సంబంధించిన ఎన్నికల తేదీలు, వేదికల వివరాలు విడుదలయ్యాయి.

విరుపాక్ష తర్వాత సంయుక్త మీనన్ కి ఏమైంది ? ఆమె జోరు ఎందుకు తగ్గిపోయింది ?
మెగాస్టార్ విశ్వంభరలో పవన్ కళ్యాణ్ కనిపిస్తారా.. అలా జరిగితే ఫ్యాన్స్ కు పండగే!

సెప్టెంబర్ 16న టెక్సాస్‌లోని శాన్ మార్కోస్, అక్టోబర్ 1న వర్జీనియా రాష్ట్రంలోని పీటర్స్ బర్గ్, అక్టోబర్ 9న సాల్ట్ లేక్ సిటీలో ఈ చర్చా కార్యక్రమాలు జరగనున్నాయి.ఇకపోతే.

Advertisement

బైడెన్ వ్యాఖ్యలపై స్పందించారు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.ఎప్పుడైనా, ఎక్కడైనా, ఏ సమయానికైనా బైడెన్‌తో డిబేట్‌కు ఓకేనని సోషల్ మీడియాలో వెల్లడించారు.

తాజా వార్తలు