ఇజ్రాయెల్ – హమాస్ యుద్ధం అమెరికాను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇజ్రాయెల్( Israel ) అనుకూల, పాలస్తీనా అనుకూల నిరసనలతో అగ్రరాజ్యంలోని విద్యాసంస్ధలు అట్టుడుకుతూ శాంతిభద్రతలకు తీవ్ర విఘాతం కలుగుతోంది.
ఈ నేపథ్యంలో న్యూయార్క్‌లోని ప్రతిష్టాత్మక కొలంబియా విశ్వవిద్యాలం సంచలన నిర్ణయం తీసుకుంది.విద్యార్దుల నిరసన నేపథ్యంలో వచ్చేవారం జరగనున్న గ్రాడ్యుయేషన్ సెర్మనీని రద్దు చేస్తున్నట్లు సోమవారం ప్రకటించింది.
ఐవీ లీగ్ ఇన్స్టిట్యూషన్ మే 15న జరగాల్సిన యూనివర్సిటీ వ్యాప్త వేడుకలను విరమించుకుందని.దీనికి బదులుగా చిన్న ఈవెంట్లను నిర్వహిస్తుందని ఓ ప్రకటనలో తెలిపింది.
దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది .

ఇటీవల అమెరికా( America )లో పలు క్యాంపస్‌లలో పాలస్తీనా అనుకూల నిరసనల్లో పాల్గొన్న దాదాపు 2500 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.టెంట్ క్యాంప్‌లు, ఆక్రమిత భవనాలను క్లియర్ చేయడానికి పోలీసులు టాక్టికల్ వెహికల్స్, ఫ్లాష్ బ్యాంగ్ పరికరాలను ఉపయోగించాల్సి వస్తోంది.గత వారం కొలంబియా యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ భవనం లోపల క్యాంప్ చేసిన నిరసనకారులను క్లియర్ చేసే క్రమంలో ఓ అధికారి అనుకోకుండా తుపాకీతో కాల్పులు జరపడం వివాదాస్పదమైంది.

అయితే కొలంబియా క్యాంపస్‌లోని హామిల్టన్ హాల్లో మంగళవారం జరిగిన ఈ ఘటనలో ఎవ్వరూ గాయపడలేదని న్యూయార్క్ పోలీస్ డిపార్ట్మెంట్ ( New York Police Department )గురువారం ప్రకటించింది.ఆ సమయంలో తన తుపాకీకి అమర్చిన ఫ్లాష్‌లైట్‌ని ఉపయోగించేందుకు ప్రయత్నిస్తుండగా.పొరపాటున ఫైరింగ్ జరిగిందని వెల్లడించింది.సమీపంలో విద్యార్ధులెవరూ లేరని, ఇతర అధికారులే వున్నారని తెలిపింది.సదరు అధికారి బాడీ క్యామ్ ఫుటేజ్‌ను విశ్లేషించడంతో పాటు డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయం ఈ ఘటనపై సమీక్ష నిర్వహిస్తోంది.కొలంబియా యూనివర్సిటీలో నిరసనల సమయంలో దాదాపు 100 మందికి పైగా విద్యార్ధులను అదుపులోకి తీసుకున్నారు.
అసోసియేటెడ్ ప్రెస్ నివేదిక ప్రకారం ఏప్రిల్ 18 నుంచి నేటి వరకు 43 యూఎస్ కళాశాలు, వర్సిటీలలో కనీసం 56 అరెస్ట్‌లు చోటు చేసుకున్నాయి.