టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన అల్లు అర్జున్( Allu Arjun ) పాన్ ఇండియా హీరోగా మంచి గుర్తింపును సొంతం చేసుకోవడంతో పాటు భాషతో సంబంధం లేకుండా సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే.అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డికి ( Snehareddy )సైతం సోషల్ మీడియా వేదికగా క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతోంది.
భార్య గురించి బన్నీ షాకింగ్ కామెంట్స్ చేయగా ఆ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.
ఫస్ట్ వన్ సైడ్ లవ్ గురించి చెప్పాలని బన్నీకి ప్రశ్న ఎదురుకాగా నా లైఫ్ టైం వన్ సైడ్ లవ్ స్నేహారెడ్డి అని బన్నీ కామెంట్లు చేశారు.
లైఫ్ లాంగ్ నేను ప్రేమించడమే తప్ప అక్కడినుంచి ఏమీ ఉండదంటూ బన్నీ చెప్పుకొచ్చారు.బన్నీ స్నేహారెడ్డి గురించి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.
అయితే బన్నీ అలా సరదాగా కామెంట్లు చేశారే తప్ప స్నేహారెడ్డి సైతం బన్నీని ఎంతగానో అభిమానిస్తారని సమాచారం అందుతోంది.బన్నీ, స్నేహారెడ్డి క్యూట్ జోడీ అనే సంగతి తెలిసిందే.బన్నీ పుష్ప ది రూల్ సినిమాతో ఇండస్ట్రీ వర్గాలను షేక్ చేసే హిట్ అందుకోవడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.పుష్ప ది రూల్ కేరళలో సైతం రికార్డ్ స్థాయి థియేటర్లలో విడుదల కానుంది.
పుష్ప ది రూల్ సినిమా బడ్జెట్ పరంగా భారీ సినిమా కాగా ఈ సినిమా కలెక్షన్ల పరంగా కూడా అదరగొట్టడం ఖాయమని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.పుష్ప ది రూల్ సినిమాలో స్పెషల్ సాంగ్ కూడా ఉండనుందని సమాచారం అందుతోంది.పుష్ప ది రూల్ సినిమా ఇతర భాషల ప్రేక్షకులను ఏ స్థాయిలో మెప్పిస్తుందో చూడాల్సి ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.