చిరంజీవి ( Chiranjeevi )మల్లిడి వశిష్ట కాంబినేషన్ లో తెరకెక్కుతున్న విశ్వంభర మూవీ ( Vishwambhara movie )టాలీవుడ్ ఇండస్ట్రీలోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా అనే సంగతి తెలిసిందే.చాలా సంవత్సరాల తర్వాత ఈ సినిమాతో చిరంజీవి త్రిష కాంబినేషన్ రిపీట్ అవుతున్న సంగతి తెలిసిందే.
తాజాగా ఈ సినిమా నుంచి త్రిష పోస్టర్ విడుదల కాగా ఆమె అచ్చం దేవకన్యలా ఉన్నారని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమయ్యాయి.
అయితే మెగాస్టార్ విశ్వంభరలో పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) కనిపిస్తారని ఒక వార్త నెట్టింట చక్కర్లు కొడుతుండగా ఆ వార్త హాట్ టాపిక్ అవుతోంది.
చిరంజీవి, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ ఫ్యాన్స్ కు సైతం ప్రత్యేకమైన కాంబినేషన్ కాగా ఈ కాంబోలో సినిమా రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.పవన్ కళ్యాణ్ గెస్ట్ రోల్ లో కనిపిస్తారని వైరల్ అవుతున్న వార్తల సారాంశం.
ఈ సినిమాలో చిరంజీవి భీమవరం దొరబాబుగా కనిపించనున్నారు.
ఐదుగురు చెల్లెమ్మలకు అన్నయ్య పాత్రలో ఆయన కనిపించనున్నారని తెలుస్తోంది.సంక్రాంతి పండుగ కానుకగా ఈ సినిమా విడుదల కానుండగా ఈ సినిమా 40 శాతం షూటింగ్ ను పూర్తి చేసుకుందని భోగట్టా.పవన్ ప్రస్తుతం తన సినిమాలకే డేట్స్ కేటాయించలేని స్థితిలో ఉన్నారు.
విశ్వంభర మేకర్స్ నుంచి ఈ వార్తలకు సంబంధించి క్లారిటీ రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.
చిరంజీవి పవన్ తరపున ఎన్నికల్లో ప్రచారం చేస్తారని వార్తలు వచ్చినా ఆ వార్తల్లో సైతం నిజం లేదని తేలిపోయింది.చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఫుల్ లెంగ్త్ రోల్స్ లో మల్టీస్టారర్ ను ప్లాన్ చేస్తే బాగుంటుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.విశ్వంభర సినిమా నుంచి త్వరలో క్రేజీ అప్ డేట్స్ రానున్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.200 కోట్ల రూపాయల అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది.