తాజాగా ఆస్ట్రేలియా విమాన సంస్థ కాంటస్( Australian airline Cantus ) కు భారీ జరిమానా పడింది.లాభాల కోసం అక్రమ విధానాలను పాటిస్తూ చివరికి భారీ మూల్యాన్ని చెల్లించుకునే పరిస్థితిని తెచ్చుకుంది విమానయాన సంస్థ.
గోస్ట్ ఫ్లైట్స్ పేరిట ప్రాచుర్యం చెందిన ఓ కుంభకోణంలో ఏకంగా 66 మిలన్ డాలర్ల జరిమానా చెల్లించేందుకు సదరు సంస్థ సిద్ధమైంది.ముఖ్యంగా ఈ కంపెనీ చేసిన పొరపాటు విషయానికొస్తే.
ముందుగానే రద్దయిన విమానాల్లోనే టికెట్లను సైతం విక్రయించింది.ఈ విషయాన్ని స్వయంగా సంస్థ అంగీకరించడంతో ఆస్ట్రేలియా నియంత్రణ సంస్థ ఈ భారీ జరిమానాను విధించింది.
ఇందుకుగాను 66 మిలియన్ డాలర్ల జరిమానాలను విధిస్తూ పాటు 86,000 మందికి ప్రయాణికులకు 13 మిలియన్ డాలర్ల పరిహారం చెల్లించాలని అందులో ఆదేశించింది.లాభాలే అన్నట్లుగా పనిచేస్తున్న కంపెనీ నిర్వాహం ఏమాత్రం ఆమాదయోగ్యం కాదని ఈ భారీ జరిమానాలను విధించింది.ముఖ్యంగా పర్యటకులు, పెద్ద పెద్ద వ్యాపారస్తులు రద్దు చేసిన విమానాల్లోని టికెట్లు కొని వారికి సంబంధించిన పనులు ఆలస్యం కావడంతో అనేక ఇబ్బందులు పడ్డారని ఈ విషయంలో తెలిపింది.
ఇందుకుగాను మూడు రోజుల ముందే రద్దయిన విమానాలు టికెట్లను సైతం విక్రయించినట్లు, అలాగే తమ కస్టమర్లకు నష్టం కలిగించామని., తాము ప్రయాణాలను పాటించడంలో విఫలం అయ్యమని అలాగే ప్రయాణికులను సకాలంలో నోటిఫికేషన్ లను పంపలేకపోయామని అందుకుగాను తాము క్షమాపణ చెబుతున్నట్లు కాంటస్ సంస్థ తన తప్పును అంగీకరిస్తూ సీఈవో తెలిపారు.ఏకంగా 13 ఏళ్ల ఘన చరిత్ర ఉన్న ఈ సంస్థ ఇలా అనైతిక విలువలను అవలించటం పై ప్రయాణికులు పెద్ద ఎత్తున తీవ్రంగా ఆగ్రహం చేస్తున్నారు.ఇన్ని ఉన్న కానీ గత ఏడాది ఈ కంపెనీ 1.1 బిలియన్ డాలర్ల లాభాన్ని నమోదు చేసింది.