ఇప్పటివరకు స్త్రీలు వారి దాంపత్య జీవితం బాగుండాలని ఎన్నో రకాల నోములు నోయడం, ఎన్నో వ్రతాలు చేయడం చూస్తుంటాం.కానీ దంపతుల మధ్య అన్యోన్యత పెరగాలంటే తప్పకుండా అనంతపద్మనాభుని వ్రతం ఆచరించాలని పురోహితులు చెబుతున్నారు.
ఈ అనంత పద్మనాభ వ్రతం గురించి ఎప్పుడు వినకపోయి ఉండవచ్చు ఈ వ్రతం ఏ విధంగా ఆచరించాలి ఈ వ్రతం చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనే విషయం గురించి ఒక కథ ప్రాచుర్యంలో ఉంది.మరి ఆ కథ ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.
పురాణాల ప్రకారం పూర్వకాలంలో ఒక గ్రామంలో నిరుపేద దంపతులు ఉండేవారు.వారికి ఒక కూతురు ఉండడంతో వారు ఆ బిడ్డని ఎంతో అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేశారు.
అయితే ఎన్నో గ్రామాలు తిరిగి తనకు సరైన వరుడిని వెతికారు.అతనితో తన వివాహం జరిపించి అత్తవారి ఇంటికి వెళ్లే సమయంలో తన కూతురుకి తన తల్లి తన ఇంట్లో ఉన్న కొంత వరి పిండిని మూట కట్టి పంపిస్తుంది.
ఈ విధంగా అత్తారింటికి బయలుదేరిన ఆ జంట సంధ్యా సమయం కావడంతో సంధ్యా వందనం చేయడానికి ఆమె భర్త చెరువుకు వెళ్ళాడు.ఈ లోపున ఆ వధువు చుట్టుపక్కల కొందరు పూజలు చేయడం చూసి ఆ పూజ వివరాలు తెలుసుకుని తాను కూడా తన తల్లి ఇచ్చిన వరిపిండితో అనంత పద్మనాభుని ప్రతిమ తయారు చేసి వ్రతం ఆచరిస్తుంది.
ఈలోగా తన భర్త రావడంతో తిరిగి వారి ప్రయాణం కొనసాగిస్తారు.మార్గమధ్యంలో తనకు బాగా ఆకలి వేయడంతో తన భార్యతో మీ అమ్మ పంపించిన వరిపిండితో తినడానికి ఏమైనా తయారు చేయమని చెప్పగా అందుకు ఆ భార్య తను చేసిన వ్రతం గురించి చెబుతూ తన చేతికి ఉన్న కంకణం చూపిస్తుంది.

ఆకలితో విసుగు చెందిన భర్త కోపంతో ఆ కంకణం తెంపి పడేస్తాడు.వారు ప్రయాణం కొనసాగిస్తుండగా వారికి బాగా ఆకలి పెరగడంతో తాను చేసిన తప్పిదం వల్ల ఇలా జరుగుతుందని భావించిన ఆ జంట తిరిగి అనంత పద్మనాభుని వ్రతం ఆచరిస్తారు.దీంతో వారు వెళ్లే మార్గం గుండా ఎన్నో పండ్లు కనిపించి వారి ఆకలి తీరుతుంది.అదే విధంగా తన ఊరికి వెళ్లగానే రాజుగారి ఆస్థానం నుండి రాజ పురోహితునిగా రావాలని ఆహ్వానం వచ్చింది.
తరువాత ఆ దంపతులకు జీవితం ఆనందంగా సాగింది.అందుకే పెళ్లైన జంట ఈ వ్రతం ఆచరించడం వల్ల వారి జీవితం సుఖసంతోషాలతో ఉంటుందని పురోహితులు చెబుతున్నారు.