అరెరే.. సమంత హాలీవుడ్ వెళ్లడం టాలీవుడ్ హీరోలకు ఇష్టం లేదా?

విడాకుల తర్వాత సమంత వరస సినిమాలను దక్కించుకుని ప్రస్తుతం బిజీగా అయితే ఈమె టాలీవుడ్ బాలీవుడ్ హాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.ఈ క్రమంలోనే సమంత నటించిన ఓ బేబీ నిర్మాతతో కలిసి సమంత ఒక సినిమాను చేయబోతోంది.

 Tollywood Top Heroes Not Wished Samantha, Samantha, Hollywood Entry, Samantha Ho-TeluguStop.com

అరేంజ్మెంట్ ఆఫ్ లవ్ అనే నవల ఆధారంగా రాబోతున్న ఈ సినిమాను హాలీవుడ్ డైరెక్టర్ ఫిలిప్ తెరకెక్కించబోతున్నాడు.అందులో సమంత బైసెక్సువల్ గా నటిస్తోంది.27ఏళ్ల తమిళ అమ్మాయిగా కనిపించనుంది.అలా సమంత హాలీవుడ్ కి కూడా అడుగుపెట్టబోతోంది.

సమంత హాలీవుడ్ సినిమాను ప్రకటించడంతో పలువురు హీరోయిన్ లు సంబరపడ్డారు.

ఈ క్రమంలోనే ప్రియమణి, లావణ్య, మంచు లక్ష్మీ, కీర్తి సురేష్, రకుల్ ప్రీత్,కాజల్, చిన్మయి, నందినీ రెడ్డి, రాశీ ఖన్నా, సోఫీ చౌదరి, స్వప్నాదత్ ఇలా ఎంతో మంది లేడీ సెలెబ్రిటీలు, హీరోయిన్ లు , దర్శక నిర్మాతలు సమంత పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు.

కానీ టాలీవుడ్ టాప్ హీరోలు మాత్రం సమంత మీద ఒక్కటంటే ఒక్క పోస్ట్ చేయకపోగా నితిన్, సుశాంత్ మాత్రం స్పందించారు. హీరో నితిన్ కంగ్రాట్స్ చెప్పగా అందుకు థాంక్స్ అంటూ హగ్స్ ని పంపించింది సమంత.

Telugu Hollywood, Maheshbabu, Nithin, Rana, Samantha, Sushanth, Tollywoodtop-Mov

సుశాంత్ చేసిన ట్వీట్ పై నెటిజన్లు రివర్స్ ఎటాక్ చేశారు.నాగచైతన్యకు సమంతా విషెస్ చెప్పలేదు కానీ నువ్వు మాత్రం ఇప్పుడు ఊపుకుంటూ ఇలా ట్వీట్ చేస్తావా అంటూ సుశాంత్ ను ఏకిపారేశారు.ఇందులో రానా సైతం పాలుపంచుకున్నారు.ఇక టాలీవుడ్ లోని స్టార్ హీరోలు అయిన ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ బాబు,అల్లు అర్జున్,ప్రభాస్ లాంటి హీరోలు ఈ ప్రాజెక్ట్ గురించి పెద్దగా పట్టించుకోలేదు.

Telugu Hollywood, Maheshbabu, Nithin, Rana, Samantha, Sushanth, Tollywoodtop-Mov

దీన్ని బట్టి చూస్తుంటే సమంత హాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడం మన టాలీవుడ్ హీరోలకు నచ్చ లేదా అనే అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి.ఇక సమంత హాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడంతో మన టాప్ హీరోలను పక్కన పెట్టినట్లు కనిపిస్తోంది.అలాగే పోను పోను స్టార్ హీరోల పక్కన కనిపించదేమో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube