సమంత ఈ పేరు గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.నటిగా ఎంత గుర్తింపు సొంతం చేసుకుందో చూసాం.
ఇక వ్యక్తిగతంగా కూడా ఈమె బాగా హాట్ టాపిక్ గా నిలిచిన సంగతి తెలిసిందే.ఏం మాయ చేసావే సినిమాతో పరిచయమైన ఈ ముద్దుగుమ్మ తొలి సినిమాతోనే తన నటనతో మెప్పించింది.
పైగా అందం విషయంలో కూడా మంచి మార్కులు సంపాదించుకుంది.
ఆ తర్వాత వెనుతిరిగి చూడకుండా వరుస సినిమాలలో రేంజ్ లో దూసుకెళ్లింది.
స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హోదాను సొంతం చేసుకుంది.ఇక మంచి హోదాలో ఉన్న సమయంలో అక్కినేని నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది.
పెళ్లి తర్వాత కూడా ఈ అమ్మడుకు బాగా కలిసి వచ్చింది.వరుస సినిమాలతో పాటు బిజినెస్ లు కూడా ప్రారంభించింది.
కానీ అంతలోనే విడిపోతున్నాం అని సోషల్ మీడియా ద్వారా ప్రకటించి అందరికి షాక్ ఇచ్చింది.ఆ సమయంలో మాత్రం చాలా విమర్శలు ఎదుర్కొంది.అయినా కూడా వాటిని తట్టుకొని ధైర్యంగా ముందుకు సాగింది.అవకాశాలు అందుకుంటూ బాగా దూసుకెళ్లింది.
అంతేకాకుండా గ్లామరస్ లుక్ లతో ఫోటోషూట్లు చేయించుకుంటూ అందరికీ మరింత షాక్ ఇచ్చింది.
ఎవరు ఏమన్నా కూడా వాటిని పట్టించుకోకుండా తనేంటో తన దారేంటో మాత్రమే చూసుకుంది.
సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక పోస్ట్ పెడుతూ బాగా సందడి చేసింది.అంతేకాకుండా పాన్ ఇండియా సినిమాలలో కూడా అవకాశాలు అందుకుంది.ప్రస్తుతం ఆమె వరుస సినిమాలతో బిజీగా ఉంది.కానీ అంతలోనే తాను అరుదైన వ్యాధితో బాధపడుతున్న విషయాన్ని తన సోషల్ మీడియా వేదికగా తెలిపి మరోసారి షాక్ ఇచ్చింది.

దీంతో ఈమెపై మరింత సింపతి పెరిగింది.గత కొన్ని రోజుల నుంచి సమంత ఆరోగ్యం గురించేబాగా వార్తలు వస్తున్నాయి.ఓ వైపు నాగచైతన్య గురించి కూడా టాక్ నడుస్తుంది.అయితే ఇదంతా పక్కనే పెడితే సమంత నటించిన పాన్ ఇండియా మూవీ యశోద ఈనెల 11న విడుదల కానుంది.
కానీ ఈ సమయంలో సమంత ఆరోగ్యం పరిస్థితి అసలు బాగోలేదు.
ఓవైపు సినిమా విడుదలకు సిద్ధంగా ఉండగా ప్రమోషన్స్ ప్లాన్స్ కూడా జరుగుతున్నాయి.
అయితే ఈ సమయంలో సమంత ప్రమోషన్స్ ఇవ్వడం కష్టమని అందరూ అనుకున్నారు.కానీ సమంత ధైర్యం చేసి తన సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంది.
యాంకర్ సుమ తనను ఇంటర్వ్యూ చేయగా అందులో తన సినిమా గురించి చాలా విషయాలు పంచుకుంది.

అంతేకాకుండా తన అనారోగ్య సమస్య గురించి చెప్పుకొని బాధపడింది.దీంతో ఆ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.అయితే అందులో సమంత ఎమోషన్ అవ్వగా అది అందర్నీ కదిలించింది.
అందరు కూడా సమంత బాధను అర్థం చేసుకున్నారు.అయితే మరి కొంతమంది మాత్రం సమంత బొద్దుగా తయారయింది అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
ఓ వైపు సమంత అలా బాధపడుతుంటే మరోవైపు ఇటువంటి కామెంట్స్ పెట్టడం అవసరమా అని అంటున్నారు కొందరు నెటిజెన్స్.