ఆముదం( Castor Oil ) నుంచి తీసిన నూనెలో అనేక రకాల ఔషధ గుణాలు ఉంటాయని ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది.ఆయుర్వేద శాస్త్రం ప్రకారం ఆముదం నుంచి తీసిన నూనెను వాపు, అన్ని రకాల నొప్పుల సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి ఉపయోగిస్తూ ఉంటారు.
ముఖ్యంగా తీవ్ర జుట్టు సమస్యలతో బాధపడుతున్న వారు ఈ ఆముదం నూనెను వినియోగించడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు.అంతేకాకుండా ఆముదం నూనె వినియోగించడం వల్ల శరీరానికి కూడా అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి.
అయితే దీని వల్ల శరీరానికి కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ఈ ఆముదం చూడడానికి ఎంతో జిగటగా ఉన్నప్పటికీ ఇది అన్ని రకాల పొట్ట సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

ముఖ్యంగా మల బద్ధకం, అజీర్ణం ( Constipation )వంటి సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ ఆముదం ప్రభావంతంగా పని చేస్తుంది.అయితే పొట్ట సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా ఈ ఆముదాన్ని ఉపయోగించే ముందు వైద్యుల సలహా తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.అంతేకాకుండా ఆముదం పిల్లలకు కడుపులో ఉండే నులిపురుగులను తొలగించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది.దీనితో పాటు పిల్లల పొట్ట సమస్యకు కూడా ఇది ఎంతో ప్రభావంతంగా పని చేస్తుంది.
అయితే దీని కోసం పిల్లలకు పట్టించే పాలలో తక్కువ పరిమాణంలో ఆమదాన్ని కలిపి ప్రతి రోజు వారికి ఇవ్వడం వల్ల నులిపురుగుల సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది.

ఇంకా చెప్పాలంటే ఆముదం నూనెను నాడీ వ్యవస్థకు సంబంధించిన వాపులు, ఇతర నరాల సమస్యలతో బాధపడుతున్న వారికి కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది.ముఖ్యంగా వయసు మళ్ళిన వారిలో వచ్చే కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పుల( Joint pain ) సమస్య నుంచి ఈ ఆముదం నూనె ఉపశమనాన్ని కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు.కాబట్టి క్రమం తప్పకుండా నొప్పులతో బాధపడుతున్న వారు తప్పకుండా నొప్పి ప్రభావిత ప్రాంతంలో ఆముదం నూనెతో మసాజ్ జ్ చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.







