మాయగాళ్లు. రోజురోజుకూ మోసాలు చేస్తూ వచ్చిన సొమ్ముతో విలాసవంతంగా గడుపుతూ ఉంటారు.పోలీసులు ఎంత అరికడుతున్న రోజురోజుకూ నేరాలు పెరిగి పోతున్నాయి.తాజాగా భార్యాభర్తలు ఇద్దరు ఒక వ్యక్తిని మోసం చేసిన ఘటన ప్రెసెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఒకటి కాదు రెండు కాదు 44 లక్షల రూపాయలను ఆ వ్యక్తి దగ్గర తెలివిగా తీసుకునాన్రు.
ఆ భార్య భర్తలు ఇద్దరు టిక్ టాక్ లో ఫేమస్.
వీళ్ళు చాలా వీడియోలు చేసారు.వారి గత కొన్ని రోజుల క్రితం ఒక వ్యక్తి దగ్గర 44 లక్షల రూపాయలను నమ్మించి మోసం చేసి తీసుకున్నారు.
అప్పటి నుండి అతడు అడిగినప్పుడల్లా ఏదొక సాకు చెప్పి ఆ వ్యక్తిని నమ్మించారు.ఇక చివరకు ఆ వ్యక్తికి అబిమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇప్పుడు కటకటాల పాలయ్యారు.
ఈ ఘటన తూర్పు గోదావరిలో జరిగింది.అక్కడే నివసించే మామిడాల శ్రీధర్, చేరుకుమిల్లి గాయత్రీ అనే దంపతులు ఈ మోసానికి పాల్పడ్డారు.వీరిద్దరూ టిక్ టాక్ వీడియోలతో స్థానికంగా ఫేమస్ అయ్యారు.ఈ క్రమంలోనే ఒక వ్యక్తిని మోసం చేసి అతడి దగ్గర నుండి 44 లక్షలను తీసుకున్నారు.
అతడి కూతురును పై చదువుల కోసం విదేశాలకు పంపిస్తామని నమ్మించారు.
ఇదంతా నిజమేనని నమ్మి అతడు ఏకంగా 44 లక్షల రూపాయలు ఈ దంపతులు చేతిలో పెట్టాడు.ఇక ఆ తర్వాత అతడి కూతురును విదేశాలకు పంపించలేదు.అందుకే అతడు డబ్బులు తిరిగి అడుగుతున్నాడని కొద్దీ రోజులు ఏదో ఒకటి చెబుతూ నమ్మించారు.
ఇక చివరికి అతడు ఒత్తిడి చేయడంతో వాళ్ళు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారు.
దీంతో అతడు వాళ్ళు మోసం చేసారని అర్ధం అయ్యి పోలీసులకు ఫిర్యాదు చేసాడు.
పోలీసులు కేసు నమోదు చేసుకుని వాళ్ళను అరెస్ట్ చేసారు.ఇలాంటి మోసాలు రోజు ఎన్ని వింటున్న గుడ్డిగా నమ్మి ఇంకా ప్రజలు మోసపోతున్నారు.
ఈ ఘటన ఇప్పుడు స్థానికంగా సంచలనం అవుతుంది.