పాకిస్తాన్ లో సిక్కు యువకుడు హత్య... దీనికోసం సిఏఏ కావాలంటున్న భారత్

పౌరసత్వ సవరణ బిల్లుని భారత్ ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన సంగతి అందరికి తెలిసిందే.అయితే ఇండియాలో కొన్ని వర్గాలు దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్నారు.

 India Condemns Attack On Nankana Sahib Gurdwara-TeluguStop.com

అయితే ప్రభుత్వం మాత్రం సిఏఏని ఎత్తి పరిస్థితిలో అమలు చేసి తీరుతామని స్పష్టం చేసింది.పొరుగు దేశాలలో మైనారిటీలుగా ఉన్న హిందూ, క్రిస్టియన్, సిక్కు, జైన్, బౌద్ధ మతాల వారు చాలా ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే.

అయితే ఇది ముస్లిం మతాన్ని కించపరిచే విధంగా ఉందని దేశంలో చాలా మంది విమర్శలు చేస్తున్నారు.
అయితే పాకిస్తాన్‌లో మైనారిటీలపై దాడులు ఏ స్థాయిలో ఉన్నాయో తాజాగా మరో ఘటన రుజువు చేసింది.రెండు రోజుల క్రితం గురుద్వారా నన్‌కానా సాహిబ్‌పై జరిగిన మూకుమ్మడి దాడి మరువక ముందే పాక్‌లో మరో దారుణం జరిగింది.25 ఏళ్ల సిక్కు యువకుడిని గుర్తు తెలియని వ్యక్తి హతమార్చాడు.భారత్ ఈ హత్యను ఖండించింది.ఖైబర్ పఖ్తుక్వాలోని షింగ్లా జిల్లాలో ఉంటున్న రవీందర్ సింగ్ పెళ్లి షాపింగ్ కోసం పెషావర్ వచ్చాడు.ఈ సమయంలో గుర్తు తెలియని ఓ వ్యక్తి అతడ్ని హతమార్చినట్లు స్థానిక మీడియా పేర్కొంది.ఈ ఘటనపై భారత్ తీవ్రంగా స్పందించింది.

ఇతర దేశాలలో మైనార్టీలు ఎంత ప్రమాదకరమైన స్థితిలో ఉన్నారో ఈ సంఘటనలే రుజువు చేస్తున్నాయని బీజేపీ పేర్కొంది.ఈ సంఘటనల కారణంగానే ఇండియాలో సిఏఏని అమలు చేయబోతుంది అంటూ కేంద్ర మంత్రి ప్రతాప్ చంద్ర సారంగీ వ్యాఖ్యలు చేశారు.

ఇక బీజేపీ నేతలు కూడా ఈ వ్యాఖ్యలని సమర్ధిస్తూ పాకిస్తాన్ తమకి సలహాలు ఇచ్చే ముందు మీ దేశంలో మైనార్టీలు పరిస్థితి ఎలా ఉందో చూసుకోవాలి అంటూ భారత్ ప్రభుత్వం విమర్శలు చేసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube