వెంకటేష్ కు సంబంధించిన రెండు మల్టీస్టారర్ సినిమాలు ఎందుకు ఆగిపోయాయో తెలుసా?

దగ్గుబాటి వెంకటేష్.మూవీ మొఘల్ రామానాయుడు వారసుడిగా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన నటుడు.

సినిమా బ్యాగ్రౌండ్ నుంచి వచ్చినా.సొంత టాలెంట్ తోనే సినిమా రంగంలో ముందుకు సాగాడు.

తక్కువ సమయంలోనే మంచి హిట్ సినిమాల్లో నటించి టాప్ హీరోగా ఎదిగాడు.కొద్ది రోజుల్లోనే విక్టరీ బిరుదు దక్కించుకున్నాడు.

మాస్, క్లాస్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలను తన సినిమాలతో ఆకట్టుకున్నాడు.ఇప్పటి వరకు ఆయన సుమారు 100 సినిమాల వరకు చేశాడు.

Advertisement

వాటిలో చాలా సినిమాలు మంచి విజయాన్ని సాధించాయి.ఆయన సినిమాలన్నీ వేటికి అవే ప్రత్యేకతను కలిగి ఉన్నాయి.

ఇతర హీరోలతో కలిసి సినిమాలు చేసేందుకు ఆయన ఎప్పుడూ ముందే ఉంటాడు.మల్టీస్టారర్ సినిమాలు చేయడం అంటే ఆయనకు చాలా సరదా.

చిన్న పెద్దా అని తేడా లేకుండా అందరితోనూ ఎలాంటి ఈగోలకు పోకుండా చేస్తాడు.ఇప్పటికే పలువురు టాప్ హీరోలతో సినిమాలు చేశాడు.

సుమన్ తో కొండపల్లి రాజా, పవన్ కళ్యాణ్ తో గోపాల గోపాల, మహేష్ బాబుతో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, వరుణ్ తేజ్ తో ఎఫ్ 2, నాగ చైతన్యతో వెంకీ మామ సినిమాలు చేశాడు.

పుష్ప సినిమాతో నాకు వచ్చిందేమీ లేదు.. ఫహద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?

ఇద్దరు టాప్ హీరోలతో కలిసి ఆయన సినిమాలు చేయాలనుకున్నా ఆగిపోయాయి.దానికి కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.1991డిసెంబర్ లో వెంకటేష్ బర్త్ డే సందర్భంగా శోభన్ బాబుతో ఓ సినిమా, కృష్ణంరాజుతో మరో సినిమా చేయాలనుకున్నాడు. యార్లగడ్డ సురేంద్ర నిర్మాతగా వెంకీ, శోభన్ బాబు హీరోలుగా ఓ సినిమా మొదలయ్యింది.

Advertisement

బి గోపాల్ డైరెక్టర్ గా ఈ సినిమా చేయాలనుకున్నారు.బప్పిల హరిని సంగీత దర్శకుడిగా తీససుకున్నారు.1992 జనవరి నుంచి షూటింగ్ మొదలు పెట్టాలి అనుకున్నారు.కానీ ఎందుకో ఈ సినిమా ఆగిపోయింది.

అటు సెల్వమణి దర్శకుడిగా వెంకీ, మోహన్ బాబు హీరోలుగా మరో సినిమాకు ప్రారంభం అయ్యింది.రామానాయుడు కెమెరా స్విచ్ ఆన్ చేశాడు.

విజయశాంతిని హీరోయిన్ గా తీసుకున్నారు.కృష్ణంరాజు మరో కీ రోల్ చేసేందుకు ఓకే చేవారు.

ఈ సినిమా కూడా కొన్ని కారణాలతో ఆగిపోయింది.

తాజా వార్తలు