Hair Growth Treatment : ఈ రెండు ప‌దార్థాల‌తో పొడ‌వాటి జుట్టును పొందొచ్చు.. తెలుసా?

పొడవాటి జుట్టు కావాలని చాలా మంది అమ్మాయిలు కోరుకుంటారు.కానీ ఆహారపు అలవాట్లు, పోషకాల కొరత, రసాయనాలు అధికంగా ఉండే షాంపూలను వినియోగించడం, కాలుష్యం, ఒత్తిడి, నిద్రలేమి తదితర కారణాల వల్ల హెయిర్ గ్రోత్ ఆగిపోతుంది.

 You Can Get Long Hair With These Two Ingredients ,long Hair, Hair Care, Hair Car-TeluguStop.com

దాంతో హెయిర్ గ్రోత్ ను పెంచుకోవడం కోసం నానా తంటాలు పడుతుంటారు.కొందరైతే మందులు వాడ‌తారు.

ఇంకొందరు ట్రీట్మెంట్ కూడా చేయించుకుంటారు.

కానీ పైసా ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే రెండు పదార్థాలతో చాలా సులభంగా పొడవాటి జుట్టును పొందవచ్చు.

మరి ఇంతకీ ఆ రెండు పదార్థాలు ఏంటి.? వాటిని ఎలా ఉపయోగిస్తే జుట్టు పొడుగ్గా పెరుగుతుంది.? వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.కలబంద, ఆముదం.

ఈ రెండు పదార్థాలతోనే జుట్టును ఒత్తుగా మరియు పొడుగ్గా పెంచుకోవచ్చు.

ముందుగా ఒక కలబంద ఆకును తీసుకుని నీటిలో శుభ్రంగా క‌డిగి లోపల ఉండే జెల్ ను సపరేట్ చేసుకోవాలి.

ఆ తర్వాత మిక్సీ జార్‌ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఆముదాన్ని వేసుకోవాలి.అలాగే అందులో కలబంద జెల్ కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని త‌ల‌తో పాటు జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు అప్లై చేసుకుని షవర్ క్యాప్ ధరించాలి.

Telugu Aloe Vera, Oil, Care, Care Tips, Long-Telugu Health Tips

గంట లేదా గంటన్నర అనంతరం మైల్డ్ షాంపూ యూస్ చేసి గోరువెచ్చని నీటితో శుభ్రంగా తల స్నానం చేయాలి.వారంలో రెండు సార్లు ఈ విధంగా కనుక చేస్తే కలబంద మరియు ఆముదం లో ఉండే పలు ప్రత్యేక సుగుణాలు హెయిర్ గ్రోత్ ను అద్భుతంగా ఇంప్రూవ్ చేస్తాయి.దాంతో జుట్టు పొడుగ్గానే కాకుండా ఒత్తుగా సైతం పెరుగుతుంది.

అంతేకాదు కలబంద మరియు ఆముదంతో పైన చెప్పిన విధంగా చేస్తే చుండ్రు త‌గ్గుముఖం పడుతుంది.జుట్టు పొట్లి పోవడం, విరగడం వంటి సమస్యల నుంచి సైతం విముక్తి లభిస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube