ఈ రెండు ప‌దార్థాల‌తో పొడ‌వాటి జుట్టును పొందొచ్చు.. తెలుసా?

పొడవాటి జుట్టు కావాలని చాలా మంది అమ్మాయిలు కోరుకుంటారు.కానీ ఆహారపు అలవాట్లు, పోషకాల కొరత, రసాయనాలు అధికంగా ఉండే షాంపూలను వినియోగించడం, కాలుష్యం, ఒత్తిడి, నిద్రలేమి తదితర కారణాల వల్ల హెయిర్ గ్రోత్ ఆగిపోతుంది.

దాంతో హెయిర్ గ్రోత్ ను పెంచుకోవడం కోసం నానా తంటాలు పడుతుంటారు.కొందరైతే మందులు వాడ‌తారు.

ఇంకొందరు ట్రీట్మెంట్ కూడా చేయించుకుంటారు.కానీ పైసా ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే రెండు పదార్థాలతో చాలా సులభంగా పొడవాటి జుట్టును పొందవచ్చు.

మరి ఇంతకీ ఆ రెండు పదార్థాలు ఏంటి.? వాటిని ఎలా ఉపయోగిస్తే జుట్టు పొడుగ్గా పెరుగుతుంది.

? వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.కలబంద, ఆముదం.

ఈ రెండు పదార్థాలతోనే జుట్టును ఒత్తుగా మరియు పొడుగ్గా పెంచుకోవచ్చు.ముందుగా ఒక కలబంద ఆకును తీసుకుని నీటిలో శుభ్రంగా క‌డిగి లోపల ఉండే జెల్ ను సపరేట్ చేసుకోవాలి.

ఆ తర్వాత మిక్సీ జార్‌ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఆముదాన్ని వేసుకోవాలి.

అలాగే అందులో కలబంద జెల్ కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని త‌ల‌తో పాటు జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు అప్లై చేసుకుని షవర్ క్యాప్ ధరించాలి.

"""/"/ గంట లేదా గంటన్నర అనంతరం మైల్డ్ షాంపూ యూస్ చేసి గోరువెచ్చని నీటితో శుభ్రంగా తల స్నానం చేయాలి.

వారంలో రెండు సార్లు ఈ విధంగా కనుక చేస్తే కలబంద మరియు ఆముదం లో ఉండే పలు ప్రత్యేక సుగుణాలు హెయిర్ గ్రోత్ ను అద్భుతంగా ఇంప్రూవ్ చేస్తాయి.

దాంతో జుట్టు పొడుగ్గానే కాకుండా ఒత్తుగా సైతం పెరుగుతుంది.అంతేకాదు కలబంద మరియు ఆముదంతో పైన చెప్పిన విధంగా చేస్తే చుండ్రు త‌గ్గుముఖం పడుతుంది.

జుట్టు పొట్లి పోవడం, విరగడం వంటి సమస్యల నుంచి సైతం విముక్తి లభిస్తుంది.

మహేష్ బాబు రాజమౌళి సినిమాలో నటించనున్న బాలీవుడ్ స్టార్ హీరో…