నెల్లూరు జిల్లా గంగపట్నంలో చిన్నారి కిడ్నాప్ కలకలం సృష్టించింది.ఏడాదిన్నర వయసున్న చిన్నారిని ఎత్తుకెళ్లేందుకు గుర్తు తెలియని దుండగులు ప్రయత్నించారు.
చుట్టు పక్కన ఉన్న వారు గమనించడంతో పారిపోయేందుకు యత్నించారు.ఈ నేపథ్యంలో చిత్తు కాగితాలు ఏరుకునే వేషధారణలో ఉన్న ముగ్గురు మహిళలను పట్టుకున్న స్థానికులు వారిని పోలీస్ స్టేషన్ లో అప్పగించారు.
ఈ కిడ్నాప్ కలకలం వ్యవహారంపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.