వీడియో: 1,435 అడుగుల ఎత్తైన యాంటెన్నా ఎక్కాడు.. చూస్తేనే గుండె అదురుతుంది..!

కొంతమందికి ప్రమాదకరమైన పనులు చేయడమంటే చాలా ఇష్టం.అలాంటి వ్యక్తులు ఎత్తైన భవనాలు ఎక్కడం, వేగంగా కార్లు నడపడం లాంటి పనులు చేస్తారు.

 Video 1,435 Feet High Antenna Will Make Your Heart Skip A Beat, Thin Antenna, Cl-TeluguStop.com

ఆ కొత్త అనుభవాల వల్ల వచ్చే థ్రిల్‌ను బాగా ఎంజాయ్ చేస్తారు.ఇటీవల, అలాంటి ఒక డేర్‌డెవిల్ న్యూయార్క్‌లోని ఎంపైర్ స్టేట్ బిల్డింగ్‌పై ( Empire State Building in New York )ఉన్న యాంటెన్నా మీదకు ఎక్కాడు.

దానిపై నిలబడి తీసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ భవనం భూమి నుంచి దాదాపు 1435 అడుగుల ఎత్తులో ఉంటుంది.వీడియోలో ఆ వ్యక్తి యాంటెన్నా ( Antenna )మీద చాలా అస్థిరంగా నిలబడి, సెల్ఫీ తీసుకుంటూ ఉన్నాడు.ఈ వీడియో చూసిన వారందరూ షాక్ అవుతున్నారు.

లైవ్‌జెన్ అనే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ ఈ వీడియో పోస్ట్ చేసింది.దీనికి “న్యూయార్క్ సిటీలోని ఎంపైర్ స్టేట్ బిల్డింగ్‌ కంటే 1,435 అడుగుల ఎత్తున్న దానిని ఎక్కడం” అని ఒక క్యాప్షన్‌ జోడించారు.ఈ వీడియోకు ఇప్పటికే 27 లక్షలకు పైగా లైక్‌లు, 4.1 కోట్లకు పైగా వ్యూస్‌ వచ్చాయి.

ఈ వీడియో చూసిన వారందరూ ఈ స్టంట్ చేయడానికి చాలా ధైర్యం కావాలి అని కామెంట్లు చేస్తున్నారు.ఒకరు “ఈ వీడియో చూస్తుంటే నా చేతులు, కాళ్లు చెమటలు పడుతున్నాయి” అని కామెంట్ చేశారు.మరొకరు “మిషన్ సక్సెస్, రెస్పెక్ట్ ++” అని రాశారు. మరొకరు “ఈ వ్యక్తికి భయమే లేదా” అని అన్నారు.మరొకరు “నీ తల్లి హార్ట్ బ్రేక్ అవుతుంది.ఆమె ఏమనుకుంటుంది?” అని అడిగారు.న్యూయార్క్ నగరంలోని మధ్య భాగంలో, 34వ వీధి, ఫిఫ్త్ అవెన్యూ కూడలిలో ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ ఉంది.దీన్ని 1931లో నిర్మించారు.దీని ఎత్తు దాదాపు 443 మీటర్లు.చాలా కాలం పాటు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనంగా ఇది ఒక వెలుగు వెలిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube