రక్తహీనత నుంచి తొందరగా బయటపడాలనుకుంటే ఈ ఆహారాలను తప్పక తీసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా కోట్లాది మంది రక్తహీనతకు( Anemia ) బాధితులుగా ఉన్నారు.రక్తహీనత అనేది రక్తంలో ఎర్ర రక్త కణాలు లేదా హిమోగ్లోబిన్ సంఖ్య తగ్గినప్పుడు సంభవించే పరిస్థితి.

 These Foods Helps To Reduce Anemia Very Quickly Details, Anemia, Anemia Reducin-TeluguStop.com

ముఖ్యంగా చిన్నపిల్లలు మరియు మహిళల్లో రక్తహీనత అనేది ఎక్కువగా ఏర్పడుతుంది.పొరపాటున రక్తహీనతను నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు గా మారుతుంది.

రక్తహీనతను తగ్గించడానికి, మీరు ఇనుము అధికంగా ఉండే ఆహారాలు మరియు మీ శరీరం ఇనుమును గ్రహించడంలో సహాయపడే ఆహారాలను తీసుకోవాలి.కాబ‌ట్టి అటువంటి ఆహ‌రాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

రక్తహీనత నుంచి తొందరగా బయటపడాలనుకుంటే ముదురు ఆకుపచ్చ ఆకు కూరలను( Green Leafy Vegetables ) తప్పక తీసుకోండి.ముఖ్యంగా పాల‌కూర‌, తోట‌కూర‌, గోంగూర వంటి ఆకుకూర‌ల‌ను ఎక్కువ‌గా తినండి.

ఇవి శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఇనుమును( Iron ) అందిస్తాయి.ర‌క్త‌హీన‌త‌ను త‌రిమికొడ‌తాయి.

అలాగే ర‌క్త‌హీన‌త ఉన్న‌వారికి క‌రివేపాకు ఎంతో ఉప‌యోగ‌క‌రంగా ఉంది.గుప్పెడు క‌రివేపాకుల‌ను దంచి మ‌జ్జిగ‌లో క‌లిపి తీసుకోవాలి.

క‌రివేపాకులో( Curry Leaves ) ఫోలిక్ యాసిడ్ ఉండటం వల్ల శరీరం ఇనుమును గ్రహించడంలో ఉత్తంగా సహాయపడుతుంది.

Telugu Anemia, Anemia Foods, Tips, Iron Rich Foods, Latest-Telugu Health

రక్తహీనత ఉన్నవారు నిత్యం ఒక దానిమ్మ పండును( Pomegranate ) తినాలి.ఐర‌న్ తో పాటు దానిమ్మలో విటమిన్ సి, విట‌మిన్ ఎ మ‌రియు విల‌మిన్ ఇ పుష్క‌లంగా ఉంటాయి.ఇవి ఎర్ర రక్త కణాల్లో హిమోగ్లోబిన్ ఉత్పత్తిని పెంచడానికి, శరీరంలో ఐరన్ కంటెంట్‌ను మెరుగుపర‌చ‌డానికి తోడ్ప‌డ‌తాయి.

అలాగే ర‌క్త‌హీన‌త‌తో బాధ‌ప‌డుతున్న వారు నిత్యం బీట్‌రూట్‌, క్యారెట్ మ‌రియు ఉసిరితో జ్యూస్ త‌యారు చేసుకుని రోజుకు ఒక గ్లాసు చొప్పున తీసుకోవాలి.ఈ జ్యూస్ తో ర‌క్తం బాగా త‌యార‌వుతుంది.

Telugu Anemia, Anemia Foods, Tips, Iron Rich Foods, Latest-Telugu Health

ఎండుద్రాక్ష, ప్రూనే, ఆప్రికాట్లు వంటి డ్రై ఫ్రూట్స్, న‌ట్స్ మ‌రియు సీడ్స్‌ ఇనుము యొక్క మంచి వనరులు.స్ట్రాబెర్రీలు, బెల్ పెప్పర్స్ మరియు టొమాటోలు వంటి విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాన్ని తినడం ద్వారా ఇనుము యొక్క శోషణను మెరుగుపరచవచ్చు.అయితే ఐరన్-రిచ్ ఫుడ్స్ ను తీసుకునే టైమ్ లో క్యాల్షియం-రిచ్ ఫుడ్స్ తినడం త‌గ్గించాలి.ఎందుకంటే కాల్షియం ఇనుము యొక్క శోషణను తగ్గిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube