వీడియో: 104 ఏళ్లుగా నడుస్తున్న ట్రైన్.. ఎక్కడో తెలిస్తే ఆశ్చర్యపోతారు...

మనం పుట్టక ముందు నుంచి ఇప్పటికీ ప్రయాణిస్తున్న రైళ్లు( Trains ) ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి.అయితే ఒక ట్రైన్ మాత్రం 104 ఏళ్లుగా నడుస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది.

 Video You Will Be Surprised If You Know Of A Train That Has Been Running For 104-TeluguStop.com

అది మరెక్కడో కాదు మన పక్క దేశమైన పాకిస్థాన్‌లోనే నడుస్తోంది! జోక్ ఏంటంటే ఈ కంట్రీ ఫామ్ అయ్యి 80 ఏళ్ళు కూడా కాలేదు.అంటే ఇది పాక్ సపరేట్ కంట్రీ అవ్వక ముందే తయారైంది.

రైలు ఆ దేశంలో 104 ఏళ్లుగా నడుస్తుందన్నది నిజమే.ఈ రైలుకి సంబంధించిన విషయాలను మరింత స్పష్టంగా తెలుసుకుందాం.

ఈ రైలు పేరు ఖైబర్ మెయిల్( Khyber Mail ).ఇది పాకిస్థాన్‌లోని అతి పాత రైళ్లలో ఒకటి.ఇటీవల, పాకిస్థాన్‌కు చెందిన రణా ఉమైర్ ( Umair )అనే వ్యక్తి ఈ రైలులో ప్రయాణించి దాని వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.

పాకిస్తాన్‌లో పేదరికం, నిరుద్యోగం ఎక్కువగా ఉండటం వల్ల దేశంలోని వనరులు, మౌలిక సదుపాయాలు చాలా దెబ్బతిన్నాయి.పాకిస్థాన్‌లోని ప్రజలు తమ దేశానికి ముందే ఉన్న వస్తువులపై ఎక్కువగా గర్విస్తారు.

కానీ, ఈ వస్తువులు అసలు భారతదేశానికి చెందినవే అని చాలా మంది అంటున్నారు.

ఇన్‌స్టాగ్రామ్‌ వీడియోలో ఆ రైలు పాకిస్తాన్‌లోనే ( Pakistan itsel )అతి పాతది, చాలా తక్కువ ఖర్చుతో ప్రయాణించే రైలు అని చెప్పారు.ఈ రైలు 1920 నుంచి నడుస్తున్నదని, అప్పట్లో కలకత్తా నుంచి పెషావర్ వరకు, స్వాతంత్యం తర్వాత కరాచీ నుంచి పెషావర్ వరకు నడిచేదని చెప్పారు.ఈ రైలులో బిజినెస్ క్లాస్, ఏసీ కంపార్ట్‌మెంట్లు, క్యాంటీన్ వంటి సౌకర్యాలు ఉన్నాయి.

ఈ రైలు అన్ని స్టేషన్లలో ఆగుతుంది.వీడియో పోస్ట్ చేస్తూ, “ఈ రీల్‌ని రైలులో ప్రయాణించాలనుకునే వారితో షేర్ చేయండి” అని క్యాప్షన్ రాశారు.

ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ @food_exploration_with_umair పోస్ట్ చేసిన ఈ వీడియోకు 11 లక్షల వ్యూస్, 41 వేల లైక్స్‌ వచ్చాయి.చాలా మంది తమ అభిప్రాయాలను కామెంట్‌ల రూపంలో తెలిపారు.సుమారు 472 మంది కామెంట్ చేశారు.ఒక యూజర్ “ఈ రైలు పాకిస్థాన్ కంటే పాతది” అని కామెంట్ చేశారు.మరొక యూజర్ “ఉమైర్, మనం గొప్ప పని చేసాం, పాకిస్తాన్ రైల్వే జిందాబాద్” అని కామెంట్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube