నీలి పసుపు ఎన్ని రోగాలకు దివ్య ఔషధంగా పనిచేస్తుందో తెలుసా..

ప్రస్తుత రోజులలో అందరూ ప్యాకెట్ వస్తువులనే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.పూర్వకాలంలో చాలామంది పసుపు కొమ్మలను తెచ్చుకొని వాటిని దంచుకుని వాడేవారు.

 Amazing Health Benefits Of Blue Turmeric,blue Turmeric,turmeric Powder,kali Hald-TeluguStop.com

నీలం రంగులో ఉండే పసుపు కొమ్మును మీరు ఎప్పుడైనా చూశారా.దీన్ని హిందీలో కాళీ హల్ది కూడా అని పిలుస్తూ ఉంటారు.

అరుణాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్ లాంటి ప్రాంతాలలో దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు.ముక్కలు చేసి చూస్తే లోపల అంతా నీలంగా ఉంటుంది.

ఈ పసుపు కొమ్ము వల్ల ఏం ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

నీలం రంగు పసుపు ఎక్కడపడితే అక్కడ ఉండదు తేమతో కూడిన అటవీ ప్రాంతాల్లోనే ఈ పసుపు పెరుగుతుంది.

ఎక్కువగా ఈశాన్య భారతదేశంలోనే ఈ పంట కనిపిస్తూ ఉంటుంది.దక్షిణ భారతదేశంలో చాలా అరుదుగా ఇది పెరుగుతుంది.దీని రుచి కాస్త కారంగా, చేదుగా ఉండి వాసన ఘటన కర్పూరం లాంటి సువాసన విడుదల చేస్తూ ఉంటుంది.వీటి రుచి అంతా బాగుండదు.

అందుకే వంటల్లో వాడరు.దీన్ని ఔషధంగా ఎక్కువగా ఉపయోగిస్తారు.

చాలా గిరిజన తెగలలో గాయాలు, చర్మపు సమస్యలకు, పాము, కీటకాలుల కాటుకు ఉపయోగిస్తారు.కడుపు నొప్పిని తగ్గించడానికి జీర్ణ సమస్యల నుంచి రక్షించడానికి ఇది ఎంతో బాగా పనిచేస్తుంది.

ఈ నీలం పసుపు పొడి నీళ్లలో కలిపి మెత్తటి పేస్టులా రాసుకుంటే తలనొప్పి తగ్గుతుందని చెబుతూ ఉంటారు.అక్కడ ఉన్న స్థానికులు నమ్మకం ఎంతో మంది స్థానిక ప్రజలు నమ్మకం.అలాగే కొన్ని కమ్యూనిటీలలో ఈ నల్ల పసుపును జేబులో పెట్టుకుంటారు.దీనివల్ల దృష్ట శక్తులు దూరమవుతాయని వారి నమ్మకం.ఇంకా చెప్పాలంటే ఈ నల్ల పసుపుతో కాషాయాన్ని కూడా తయారు చేస్తూ ఉంటారు.దీన్ని రెఫ్రిజిరేటర్ లో పెట్టుకుని నాలుగు నుంచి ఆరు నెలల వరకు నిల్వ చేసుకోవచ్చు.

అయితే ఇది అంత అరుదుగా జరుగుతుంది.బయట కంటే ఆన్లైన్ మార్కెట్లో ఇది లభిస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube