ప్రతిరోజు ఉదయాన్నే పూజలు చేసేటప్పుడు ఈ తప్పులను అస్సలు చేయకూడదు..

మన దేశ వ్యాప్తంగా చాలామంది ప్రజలు ప్రతిరోజు వారి ఇళ్లలో పూజలు చేసి దేవుళ్లకు హారతులు ఇస్తూ ఉంటారు.ఇలా ప్రతిరోజు ఉదయమే పూజ చేసి హారతులు ఇవ్వడం అనేది మామూలు విషయం మాత్రం కాదు.

 These Mistakes Should Not Be Made At All While Performing Pooja Every Morning ,p-TeluguStop.com

కానీ కొంతమంది మాత్రం ఇలా పూజ చేసేటప్పుడు కొన్ని తప్పులను వారికి తెలియకుండానే చేస్తూ ఉంటారు.అయితే సరిగ్గా చేసే పూజలు మాత్రమే శుభ ఫలితాలను అందిస్తాయని వేద పండితులు చెబుతున్నారు.

ఇలా పూజలను కచ్చితంగా సరిగ్గా చేయడం వల్ల ఇంట్లో ఆనందం, శాంతి ఉంటాయని కూడా చెబుతున్నారు.

అయితే ఒక్కొక్కరి పూజా విధానం ఒక్కొక్క రకంగా ఉంటుంది.

అయితే చాలామంది పూజ చేసేటప్పుడు తెలియకుండా తప్పులను చేయడం వల్ల శుభ ఫలితాలకు బదులుగా చెడు ఫలితాలు కూడా కలిగే అవకాశం ఉంది.పూజ చేసేటప్పుడు ఏ ఏ విషయాలపై ప్రత్యేకంగా దృష్టి ఉంచాలో ఇప్పుడు తెలుసుకుందాం.

సరైన దిశలో పూజలు చేయడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు లభించే అవకాశం ఉంది.ఇంట్లో పూజ స్థలం లేదా దేవాలయం ఈశాన్య దిశలో ఉండడం మంచిది.పూజకు ఈ దిశ అత్యంత శుభప్రదం అని చాలామంది ప్రజలు భావిస్తారు.పూజ చేసేటప్పుడు ముఖాన్ని పడమర వైపు ఉంచడం ఎంతో మంచిది.

భక్తులకు రోజువారి దర్శనం ఇచ్చే ఏకైక దేవుడు సూర్య భగవంతుడు ఉదయాన్నే ఆయనకు సమర్పించడం ఎంతో మంచి.దీనివల్ల మీకు అదృష్టం మరియు సమాజంలో గౌరవం పెరిగే అవకాశం ఉంది.పూజ చేసేటప్పుడు నేలపై కూర్చోకూడదు.జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పూజ సమయంలో తప్పనిసరిగా ఆసనం వేయాలని చెబుతున్నారు.ఇది మీ పూజలు అర్థవంతం చేస్తుంది.ఇంటి నుంచి పేదరికం తొలగించే అవకాశం ఉంది.

ఇంకా చెప్పాలంటే ఇంటి నుంచి ప్రతికూల శక్తులు దూరమై శుభ ఫలితాలు పొందడానికి ఉదయం, సాయంత్రం దేవాలయంలో దీపం వెలిగించడం ఎంతో మంచిది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube