పైల్స్ సమస్యను తగ్గించే అద్భుతమైన,సులభమైన చిట్కాలు

పైల్స్ సమస్య వచ్చినప్పుడు వచ్చే బాధ విపరీతంగా ఉంటుంది.ఏ పని మీద దృష్టి పెట్టలేరు.

 Home Remedies Forhemorrhoids Piles , Forhemorrhoids,  Piles, Home Remedies, Whit-TeluguStop.com

అంతేకాక చాలా చిరాకుగా ఉంటుంది.కాల‌కృత్యాలు తీర్చుకోవటానికి వెళ్లిన ప్రతిసారి మంట,నొప్పితో విపరీతమైన నరకయాతన అనుభవించాల్సి ఉంటుంది.

పైల్స్ రావటానికి అనేక కారణాలు ఉన్నాయి.వాటిలో ముఖ్యమైనవి మ‌ల‌బ‌ద్ద‌కం, థైరాయిడ్‌, డ‌యాబెటిస్‌, మాంసం, ఫాస్ట్‌ఫుడ్‌ ఎక్కువగా తీసుకోవటం మరియు ఎక్కువ సేపు కూర్చోవటం వంటివి కారణాలు.

ఈ సమస్యకు డాక్టర్ ఇచ్చిన మందులను వాడుతూ ఇప్పుడు చెప్పే చిట్కాలను పాటిస్తే మంచి ఉపశమనం కలుగుతుంది.ఒక కప్పు నీటిలో నాలుగు బిర్యాని ఆకులు,మూడు వెల్లుల్లి రెబ్బలు వేసి బాగా మరిగించాలి.ఈ నీటిని వడకట్టి చల్లారబెట్టాలి.ఈ నీటిని నొప్పి ఉన్న ప్రాంతంలో రాయాలి.ఈ విధంగా రోజులో మూడు సార్లు రాయాలి.

తెల్ల చామంతి పువ్వును రేకలుగా విడతీసి ఒక కప్పు నీటిలో వేసి బాగా మరిగించాలి.

ఈ నీటిని వడకట్టి చల్లారబెట్టాలి.ఈ నీటిని నొప్పి ఉన్న ప్రాంతంలో రాయాలి.

ఈ విధంగా రోజులో మూడు సార్లు రాయాలి.ఒక కప్పులో ఆపిల్ సైడర్ వెనిగర్ తీసుకోని దానిలో కాటన్ బాల్ ముంచి నొప్పి ఉన్న ప్రాంతంలో రాయాలి.

ఈ విధంగా రోజులో మూడు సార్లు రాయాలి.ఒక బౌల్ లో ఒక కాయ నిమ్మరసం పిండి దానిలో పావు స్పూన్ తేనే,పావు స్పూన్ అల్లం రసం వేసి బాగా కలపాలి.

ఈ మిశ్రమాన్ని నొప్పి ఉన్న ప్రాంతంలో రాయాలి.ఈ విధంగా రోజులో మూడు సార్లు రాయాలి.

ఈ మిశ్రమాన్ని రాసినప్పుడు కొంచెం మంట ఉంటుంది.అయినా ఈ చిట్కా చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.

ఒక బౌల్ లో ఆలివ్ ఆయిల్ తీసుకోని కాటన్ బాల్ ముంచి నొప్పి ఉన్న ప్రాంతంలో రాస్తే త్వరగా ఉపశమనం కలుగుతుంది.ఆలివ్ ఆయిల్ లో యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ లక్షణాలు సమృద్ధిగా ఉండుట వలన తొందరగా నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube