ముఖ్యంగా చెప్పాలంటే దేవాలయానికి వెళ్లే భక్తులు సాధారణంగా పూలు, పండ్లు లేదా ఇతర ఆహార పదార్థాలను దేవునికి నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు.భగవంతుడికి సమర్పించిన నైవేద్యాన్ని తిరిగి భక్తులకు పంచిపెడతారు.
అన్ని ఆలయాలలో ఇలాగే జరుగుతూ ఉంటుంది.అయితే ఉజ్జయినీలోని కాలభైరవ దేవాలయంలో( Kalabhairava temple at Ujjain ) స్వామివారికి మద్యాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు.
ఈ దేవాలయాన్ని నిత్యం ఎన్నో లక్షల మంది భక్తులు దర్శించుకుంటూ ఉంటారు.దీని వల్ల ఈ ఆలయంలో జరిగే జాతర సమయంలో సారాయి ఏరులై పరుతుంది.
అందరూ దీన్ని సారాయి అంటే భక్తులు మాత్రం తీర్ధమని చెబుతూ ఉంటారు.మరి ఆ దేవాలయం ఎక్కడుంది? ఎందుకు ఈ దేవాలయంలో మద్యాన్ని నైవేద్యంగా సమర్పిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.దేవాలయానికి వెళ్లిన భక్తులకు తీర్థంగా పంచమృతం లేదా తులసి తీర్ధాన్ని ఇస్తారు.కొన్ని దేవాలయాలలో కొబ్బరి నీళ్లను తీర్థంగా అందిస్తారు.
ఉజ్జయినీలోని కాలభైరవ దేవాలయంలో మద్యాన్ని ప్రసాదంగా ఇస్తే కర్ణాటకలోని( Karnataka ) ఒక దేవాలయంలో కూడా తీర్థంగా సారాయి, బీర్లను ఇస్తూ ఉంటారు.ఇలా ఎందుకు ఇస్తారు అని ప్రశ్నిస్తే అక్కడి భక్తులు చెప్పే మాటలు వింటే ఆశ్చర్యపోతారు.

సుమారు ఆరు శతాబ్దాలుగా ఈ ఆచారం కొనసాగుతున్నట్లు భక్తులు చెబుతున్నారు.ఇంతకీ ఈ దేవాలయం ఎక్కడ ఉంది.మద్యం తీర్థంగా ఇవ్వడం వెనుక ఉన్న కారణం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.మద్యాన్ని తీర్థంగా ఇచ్చే దేవాలయం గురించి తెలుసుకోవాలంటే మనం కర్ణాటకలోని బాగల్‌కోట్ జిల్లాకు వెళ్లాలి.
జిల్లాలోని గులేడాగుడ్డలోని లింగాపూర్ అనే గ్రామంలో కనకరాయ దేవుని ఆలయం( Lord Kanakaraya temple ) ఉంటుంది.ఈ దేవాలయం ముందు వరుసగా పదుల సంఖ్యలో దుకాణాలు ఉంటాయి.
ఈ దుకాణాలలో పూలు, కాయలకు బదులుగా మద్యం అమ్ముతూ ఉంటారు.

ఈ దేవాలయానికి వచ్చే భక్తులు మద్యం కొనుగోలు చేసి కనకరయ్యకి, లక్ష్మీ రంగనాథానికి సమర్పిస్తారు.భక్తులు సమర్పించిన మద్యాన్ని స్వామి వారికి నైవేద్యంగా సమర్పించి దానిని తిరిగి తీర్థంగా భక్తులకు అందజేస్తారు.ఈ ఆచారం 60 ఏళ్లుగా కొనసాగుతోంది.
ప్రతి సంవత్సరం హోలీ తర్వాత వచ్చే పౌర్ణమి రోజున దేవాలయంలో పెద్ద ఎత్తున జాతర నిర్వహిస్తారు.ఈ జాతరకు వచ్చిన భక్తులు తమ కోరికలు తీర్చాలని మొక్కుకొని మద్యం సమర్పించి తీర్థం పుచ్చుకుంటారు.
అసలు ఈ ఆచారం ఎలా మొదలైందో ఇప్పుడు తెలుసుకుందాం.కొన్ని శతాబ్దాల క్రితం ఈ ప్రాంతంలో కరువు ఏర్పడింది.
తాగునీరు లేక ఇబ్బంది పడుతున్న ప్రజలకు రంగనాథుడు దారి చూపించాడు.పండ్ల రసంలో నీరు పోసి రసాన్ని ఇచ్చి ప్రజలకు దాహార్తిని తీర్చాడు.
ఈ సమయంలో పండ్ల రసం అంటే సోమరసంగా చెప్పేవారు.సోమరసమే ఇప్పుడు సారాయిగా మారింది.
కనుకరాముడు, లక్ష్మీరంగనాథుడికి పండ్ల రసానికి బదులుగా సారాయిని నైవేద్యంగా సమర్పించడం అప్పటినుంచి వస్తుందని భక్తులు చెబుతున్నారు.