యాదగిరిగుట్ట పట్టణంతో పాటు కొండపై ఆదివారం భక్తులు భారీగా తరలివరీ రావడం వల్ల తీవ్ర రద్ది ఏర్పడింది.లక్ష్మీ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు కొండపైకి చేరుకొని స్వామివారిని దర్శించుకోవడానికి క్యూ లైన్ లో భారీ ఎత్తున వేచి చేశారు.
పెద్ద ఎత్తున వాహనాలు కొండపైకి చేరుకోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.లక్ష్మీనరసింహస్వామిని హైకోర్టు జడ్జ్ జస్టిస్ వెంకటేశ్వర రెడ్డి దంపతులు దర్శించుకుని ప్రత్యక్ష పూజలు చేశారు.
స్వామివారి పల్లకి సేవలో కూడా ఈ దంపతులు పాల్గొన్నారు.స్వామివారికి దాదాపు 48 లక్షల రూపాయలు ఆదాయం సమకూరడం విశేషం.ఇందులో ప్రసాద విక్రయం ద్వారా 23.6 లక్షలు, వాహనాల పార్కింగ్ ద్వారా ఐదు లక్షల ఆదాయం రావడం జరిగింది.
భద్రాచలం శ్రీ సీత రామచంద్ర స్వామి దేవాలయంలో ఆదివారం రాములవారికి ప్రత్యేక పూజలు చేశారు.దేవాలయం తలుపులు తెరిచిన తర్వాత అర్చకులు రామయ్యకు సుప్రభాతం పలికి ఆరాధించారు.
బంగారు పుష్పాలను స్వామి పాదాల వద్ద ఉంచి పూజ చేశారు.క్షేత్ర విశిష్టతను వైదిక పెద్దలు ప్రవచించిన తీర్పు భక్తులు మైమరిచిపోయారు.
నిత్య కళ్యాణం భక్తి సాగరంలో తేలి ఆడినట్లు దేవాలయంలో అనిపించింది.కంకణ ధారణను కమనీయంగా సాగించారు.

మంగళ ధారణ కడు రమణీయంగా కనిపించగా తలంబ్రాల వేడుకలు జై జై నిరాజనాలతో రాముల వారి దేవాలయం మార్మోగిపోయింది.అంతేకాకుండా దర్బారు సేవ భక్తిశ్రద్ధలతో చేశారు.ధనుర్మాస ఉత్సవాలను పురస్కరించుకొని అండళ్ళ అమ్మకు తిరుప్పావై సేవ కూడా చేశారు.తిరుప్పవై ప్రవచనం తో అలరించారు.అంతేకాకుండా పాడేరు ఎస్పీ సతీష్ కుమార్ కుటుంబ సమేతంగా రాములవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయించారు.దేవాలయ ప్రత్యేక అధికారి శ్రీనివాసరావు ఎస్పీ గారికి సాదర స్వాగతం పలికారు.
వేద పండితులు హనుమంత్ శాస్త్రి నేతృత్వంలో ఆశీర్వచనం అందించగా విశ్రాంత ప్రధాన అర్చకులు జగన్నాథచార్యులు కూడా పాల్గొన్నారు
.