మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సమావేశం అయ్యారు.మైనంపల్లి హనుమంతరావు ఇంట్లో ఎమ్మెల్యేలు భేటీ అయిన సంగతి తెలిసిందే.
ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు వివేకానంద, మాధవరం కృష్ణారావు, అరికెపూడి గాంధీతో పాటు సుభాష్ రెడ్డిలు హజరైయ్యారు.
ఈ నేపథ్యంలో మంత్రి మల్లారెడ్డి తీరుపై ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
మంత్రి అంటే అందరికీ న్యాయం చేయాలని మైనంపల్లి వ్యాఖ్యనించారు.పదవులన్నీ ఆయనే తీసుకుంటే తమ క్యాడర్ కు ఏం చెప్పాలని ప్రశ్నించారు.
క్యాడర్ కు న్యాయం చేయాలని స్పష్టం చేశారు.