శివరాత్రి రోజు ఓం నమః శివాయ అనే మంత్రాన్ని పాటించడం వల్ల అన్ని కష్టాలు దూరం అయిపోతాయి.జీవితంలో సంతోషంతో పాటు ఆర్థిక అభివృద్ధి ఉంటుంది.
రోజు శివ పూజ చేసేవారు ఉన్నారు.ఈశ్వరుడు, పరమశివుడు, స్మశానవాసి అని పిలవబడే శివుడు భక్తులకు త్వరగా మోక్షాన్ని ప్రసాదిస్తాడని వేద పండితులు చెబుతున్నారు.
ఎలాంటి కష్టాలు వచ్చినా శివుడిని ధ్యానిస్తే క్షణంలో శాంతి కలుగుతుందని శివ భక్తులు నమ్ముతారు.
శివరాత్రి శివుని ఆరాధనకు అంకితం చేయబడింది.
ఆ రోజు శివుని ఆశీర్వాదం కోసం అభిషేకం,పూజలు, ఉపవాసం మరియు ధ్యానం భక్తులు చేస్తూ ఉంటారు.శివుడికి కొన్ని విషయాలు అంటే ఎంతో ఇష్టం.
శివరాత్రి రోజున ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే తప్పకుండా ఆ భగవంతుని అనుగ్రహం మీ ఇంటిపై ఉంటుంది.

ఆయన ఆశీస్సులతో కష్టాలన్నీ దూరమైపోతాయి.శివరాత్రి రోజున మీరు ఏ వస్తువులు ఇంటికి తీసుకురావాలో ఇప్పుడు తెలుసుకుందాం.శివరాత్రి రోజున శివుడి వాహనమైన నంది విగ్రహాన్ని ఇంటికి తీసుకురావడం ఎంతో మంచిది.
మహాశివరాత్రి రోజు శివునితో పాటు నంది పూజ కూడా చేయడం మంచిది.చేతిలో డబ్బులు లేని వారు, ఇంట్లో నిత్యం ఆర్థిక సమస్యలు ఉన్నవారు, మహాశివరాత్రి రోజున వెండి నందిని తెచ్చి పూజించడం వల్ల ఈ కష్టాలన్నీ దూరమవుతాయి.

ఇంకా చెప్పాలంటే నందిని పరమశివుని స్వరూపమని కూడా చెబుతూ ఉంటారు.మహాశివరాత్రి రోజు ఏక ముఖ రుద్రాక్షలు ఇంటికి తీసుకుని రావడం వల్ల మంచి జరుగుతుంది.మహాశివరాత్రి రోజున ఏక ముఖ రుద్రాక్ష తెచ్చి శివుని మంత్రాన్ని జపించి శుద్ధి చేసి ధరించాలి.దీంతో అనేక సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు అన్ని దూరం అయిపోతాయి.