సనాతన ధర్మం ప్రకారం మన దేశంలో చాలా మంది ప్రజలు అనేక రకాల ఆచారాలను పూర్వపు రోజుల నుంచి పాటిస్తూ వస్తున్నారు.ఇందులో దాన ధర్మాలు చేయడానికి కూడా కొన్ని పద్ధతులు ఉన్నాయి.
మన జీవితంలో కష్టపడి సంపాదించిన డబ్బు దానం చేస్తే మంచి జరుగుతుందని చాలా మంది పెద్దవారు చెబుతూ ఉంటారు.అయితే దాన ధర్మాల్లో మహిళలు ఎప్పుడు ముందుంటారు.
ఎందుకంటే వారిది జాలి హృదయం కాబట్టి, కానీ మహిళలు దాన ధర్మాలు కొన్ని సమయాల్లో చేయాలని చెబుతూ ఉంటారు.ఎప్పుడు పడితే అప్పుడు దాన ధర్మం చేస్తే కుటుంబంలో అనేక రకాల సమస్యలు వస్తాయని వేద పండితులు చెబుతున్నారు.
ముఖ్యంగా చీకటి పడ్డాక ఈ వస్తువులను అసలు దానం చేయకూడదని చెబుతూ ఉన్నారు.ఆ వస్తువులేంటో, ఏ సమయంలో దానం చేస్తే ఏమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.చీకటి పడ్డాక పాలు, పెరుగు ను దానం చేయకూడదు.ఎందుకంటే ఇలా చేస్తే ఇంట్లో డబ్బు కోసం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
కాబట్టి చీకటి పడ్డాక పాలు, పెరుగు(curd) దానం చేయకపోవడమే మంచిదని పెద్దవారు చెబుతూ ఉంటారు.
అంతే కాకుండా సాయంత్రం పూట ఉప్పు, పసుపు(Salt)ను ఎవరికైనా దానం చేయడం అసలు మంచిది కాదు.ఇలా చేయడం వల్ల ఇంటికి అరిష్టం కలుగుతుందని చాలా మంది ప్రజలు నమ్ముతారు.కాబట్టి సాయంత్రం ఉప్పు, పసుపు దానం చేయకపోవడమే మంచిది.
ముఖ్యంగా చెప్పాలంటే ఉల్లి, వెల్లుల్లిని కూడా చీకటి పడ్డాక దానం చేయకూడదు.ఒక వేళ దానం చేస్తే గ్రహాల పై ప్రభావం పడి ఆర్థికంగా ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది.
కాబట్టి పాలు, పెరుగు, ఉప్పు, పసుపు, ఉల్లి, వెల్లుల్లి (Onion)లాంటి వస్తువులను రాత్రి సమయంలో అసలు దానం చేయకూడదు.ఇలా దానం చేస్తే ఎన్నో రకాల ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.