Rajamouli Keeravani Movies: రాజమౌళి, కీరవాణి ఎవర్ గ్రీన్ కాంబినేషన్.. రికార్డు సృష్టించిన సినిమాల లిస్ట్ ఇదే?

తెలుగు ప్రేక్షకులకు డైరెక్టర్ రాజమౌళి అలాగే కీరవాణి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.వీరిద్దరి కాంబినేషన్లో ఇప్పటికే ఎన్నో సూపర్ హిట్ సినిమాలు విడుదల అయిన విషయం తెలిసిందే.

 Rrr Oscar Tollywood Blockbluster Combination From Student No 1 To Rrr Here Are-TeluguStop.com

ఆ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి.అందుకే వీరిద్దరి కాంబినేషన్ ని ఎవర్ గ్రీన్ గా కూడా పిలుస్తూ ఉంటారు.

ఇకపోతే ఆ సినిమాల విషయానికొస్తే.రాజమౌళి, కీరవాణి కాంబినేషన్‌లో వచ్చిన తొలి సినిమా స్టూడెంట్ నెం.1. ఈ సినిమాకి 2 కోట్ల బడ్జెట్ పెట్టగా, రూ.12 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి.అలాగే రాజమౌళి, కీరవాణి కాంబినేషన్‌లో వచ్చిన రెండో సినిమా సింహాద్రి.

ఈ సినిమాకు బడ్జెట్ 8 కోట్లు పెట్టగా,రూ.26 కోట్ల కలెక్షన్స్ ని సాధించింది.ఈ సినిమాతో ఎన్టీఆర్ ఓవర్ నైట్ స్టార్ హీరో అయిపోయి విషయం తెలిసిందే.జక్కన్న, కీరవాణి కాంబినేషన్‌లో వచ్చిన మూడవ సినిమా సై. ఈ సినిమాకు 5 కోట్ల బడ్జెట్ పెట్టగా రూ.9.5 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి.అలాగే రాజమౌళి, కీరవాణి కాంబినేషన్‌లో వచ్చిన నాలుగో మూవీ ఛత్రపతి. కాగా ఈ సినిమాకు 10 కోట్ల బడ్జెట్ పెట్టగా రూ.21 కోట్లు కలెక్షన్స్ వచ్చాయి.

Telugu Baahubali, Chatrapathi, Eega, Keera Vani, Magadheera, Maryada Ramanna, Ra

అదేవిధంగా రాజమౌళి, కీరవాణి కాంబినేషన్‌లో వచ్చిన ఐదవ సినిమా విక్రమార్కుడు.ఈ సినిమాకు పెట్టిన బడ్జెట్ రూ.11 కోట్లు కాగా రూ.23 కోట్లు కలెక్షన్స్ వచ్చాయి.ఇక రాజమౌళి, కీరవాణి కాంబినేషన్‌లో వచ్చిన ఆరవ సినీమా యమదొంగ. ఈ సినిమాకి రూ.18 కోట్లు బడ్జెట్ పెట్టగా రూ.30 కోట్ల కలెక్షన్ వచ్చాయి.అదేవిధంగా రాజమౌళి, కీరవాణి కాంబినేషన్‌లో వచ్చిన 7వ మూవీ మగధీర.ఈ సినిమాకు పెట్టిన రూ.44 కోట్లు బడ్జెట్ పెట్టగా.రూ.78 కోట్లు వచ్చాయి.

Telugu Baahubali, Chatrapathi, Eega, Keera Vani, Magadheera, Maryada Ramanna, Ra

రాజమౌళి, కీరవాణి కాంబినేషన్‌లో వచ్చిన ఎనిమిదవ మూవీ మర్యాద రామన్న. ఈ సినిమాకి రూ.14 కోట్లు పెట్టుబడి పెట్టగా రూ.29 కోట్లు వచ్చాయి.అలాగే ఈగ సినిమాకు గాను రూ.26 కోట్లు బడ్జెట్ పెట్టగా రూ.45 కోట్లు కలెక్షన్స్ వచ్చాయి.బాహుబలి ది బిగినింగ్ కి 136 కోట్లు బడ్జెట్ పెట్టగా 600 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది.బాహుబలి ది కంక్లూజన్ సినిమాకి రూ.250 కోట్లు ఖర్చు పెట్టగా దాదాపు రూ.854 కోట్ల కలెక్షన్స్ సాధించింది.అలాగే ఆర్ఆర్ఆర్ సినిమా 1215 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube