దిష్టి( dishti ) నివారణకు చాలామంది ప్రజలు అనేక యంత్రాలు ఉపయోగిస్తూ ఉంటారు.అలాగే కొందరు నిమ్మకాయలు కడుతూ ఉంటారు.
మరి కొంతమంది చిన్నపిల్లలకు దిష్టి చుక్క పెడతారు.ఇంకొందరు తాయాత్తు కట్టుకుంటూ ఉంటారు.
మిరపకాయలు( chilli ) కూడా దిష్టి తీసి వేస్తుంటారు.దిష్టి రకరకాలుగా ఉంటుంది.
మనిషి కన్ను పడితే రాయి కూడా కరిగిపోతుందని పెద్దవారు చెబుతూ ఉంటారు.అంతటి మహత్తర శక్తి మనిషి కన్నులో ఉంది.
ఎవరి నమ్మకాలు వారివి కొందరు మాత్రం దిష్టి లేదంటారు.

మన భారతీయుల మాదిరి చైనాలు కూడా వాస్తు గురించి ఎన్నో పరిశోధనలు చేసి పాజిటివ్ ఎనర్జీ తీసుకొచ్చేలా ఒక యంత్రాన్ని కనుగొన్నారు.అదే ఈవిల్ ఐ( Evil Eye ) యంత్రం.ఇది దగ్గర పెట్టుకుంటే వాస్తు రిత్యా మనకు ఎలాంటి ఇబ్బందులు రావని చెబుతున్నారు.
చాలామంది దీన్ని కొనుగోలు చేస్తున్నారు.దిని వల్ల దీని ప్రాబల్యం బాగా పెరిగింది.
ఏదో విధంగా దీన్ని ధరిస్తున్నారు.ఈవిల్ ఐ గుండ్రంగా వృత్తాకారంగా కంటిపాప వలే ఉంటుంది.
దీన్ని నీలం గాజుతో చేస్తారు.

ఇది సంప్రదాయ ఫెంగ్ షూయి( Feng Shui ) దిష్టి నివారణకు ఉపయోగించే సాధనమని చెబుతున్నారు.గుండ్రని ఆకారం నీలిరంగు విశ్వాసానికి ప్రతికలు, మధ్యలో ఉండే తెల్లని నలుపు రంగులు కంటికి,కంటి చూపులోని స్వచ్ఛతకు చురుకుతనానికి గుర్తులు.దీన్ని మొక్కలు, జంతువులు, చిన్నపిల్లలు, ఇల్లు, వాహనాలు దేనికైనా రక్షణగా ఉండడానికి ధరించవచ్చు.
ఈఫిల్ ఐ పాజిటివ్ శక్తిని ఆకర్షిస్తుంది.నెగిటివ్ శక్తిని దూరం చేస్తుంది.
తాయత్తు కట్టుకున్న ఫీలింగ్ కలుగుతుంది.ఇది ఉన్న చోట శత్రువులను నిరోధిస్తుంది.
దీన్ని ఆఫీస్ డెస్క్ మీద ఉంచుకుంటే మంచిది.వ్యక్తిగత రక్షణ ను ఇస్తుంది.
అలాగే కారు, మొబైల్ లాంటి వాటికి అండగా నిలుస్తుంది.ఇంట్లో వాల్ హ్యాంగింగ్ చేస్తే చాలా ఇళ్ళలో ఎలాంటి బాధలు లేకుండా చేస్తుంది.
ఇలా యంత్రం మనకు రక్షణగా ఉంటుందని చాలా మంది ప్రజలు నమ్ముతున్నారు.