ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు 2 వ రోజు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి.ఇందులోభాగంగా ధ్వజారోహణ పూజలు నయనమనోహరంగా రాగతాళ ధ్వనులతో వేదమంత్రాలు మంగళవాయిద్యాల నడుమ అంగరంగ వైభవంగా నిర్వహించారు.
స్వామివారి ఆస్థానం నుంచి స్వామివారిని, ధ్వజ పటాన్ని ఉరేగిస్తూ ధ్వజ స్థంభం వద్దకు తీసుకువచ్చి, ధ్వజారోహణం చేశారు.
దేవతామూర్తులను ఆహ్వానిస్త ధ్వజపటంపై గరుడువంతునికి ప్రత్యేక పూజలు నిర్వహించి గరుడ ముద్దలు ఎగురవేశారు.
గరుడ ముద్దలు అందుకునేందుకు భక్తులు పోటీ పడ్డారు.రాత్రి భేరిపూజ, దేవతాహ్వానం నిర్వహించనున్నారు.
స్వామి వారి కల్యాణం వీక్షించమని 33 కోట్ల దేవతలను ఆహ్వానం పలుకనున్నారు .ఈ పూజల్లో దేవాదాయ ధర్మాదాయ శాఖ కమీషనర్ అనిల్ కుమార్, ఆలయ ఈవో గీత, చైర్మన్ నరసింహమూర్తి తో పాటు భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.