అక్కడ లెక్కలేనంతంగా బంగారు నిక్షేపాలు.. అయితే అదొక్కటి తొలగిస్తే చాలు..

భారతదేశం తన ప్రాచీన సంస్కృతి కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందింది.అయితే ఇప్పటికీ శాస్త్రవేత్తలకు పజిల్‌గా ఉన్న అనేక రహస్య ప్రదేశాలు దేశంలో అనేకం ఉన్నాయి.

 Mysterious Hidden Treasure In Rajgir Bihar , Hidden Treasure, Rajgir Bihar, Biha-TeluguStop.com

వీటిలో బీహార్‌లోని బంగారు నిధుల రహస్యం కూడా ఉంది.ఆ నిధిని వెలికితీసేందుకు ఎంతమంది ప్రయత్నించినా సాధ్యం కాలేదు.

ఈ బంగారు నిక్షేపాలు బీహార్‌లోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం రాజ్‌గిర్‌లోని ఒక గుహలో ఉన్నాయి.హర్యాంక రాజవంశాన్ని స్థాపించిన బింబిసారకు బంగారమన్నా, వెండి అన్నా చాలా ఇష్టమని చరిత్రకారులు చెబుతారు.

రాజ్‌గిర్‌లోని ఈ గుహలో బింబిసారునికి చెందిన అమూల్యమైన సంపద దాగివుందని చెబుతారు.బింబిసారుని భార్య ఈ నిధిని దాచిపెట్టారట.

అయితే ఇప్పటి వరకు ఈ నిధిని ఎవరూ కనుగొనలేకపోయారు.బ్రిటీష్ పాలకులు ఈ గుహలోకి వెళ్ళడానికి చాలా ప్రయత్నాలు చేశారు.

అవన్నీ కూడా విఫలమయ్యారు.ఈ నిధిని ‘సోన్ భండార్‘ అంటారు.

నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం ఈ గుహను బింబిసారుని భార్య నిర్మించారు.

ఈ సోన్ భండార్ ఇప్పటికీ ప్రపంచానికి ఒక రహస్యంగానే మిగిలింది.

దీనిని ప్రతి ఏటా వేలాది మంది పర్యాటకులు సందర్శిస్తారు.ఇక్కడికి వచ్చే పర్యాటకులలో ఈ అపరిష్కృత రహస్యాన్ని తెలుసుకోవాలనే కోరిక ఉంటుంది.

ఈ నిధి మగధ చక్రవర్తి జరాసంఘకు చెందినదని కొందరు చెబుతారు.అయితే ఈ నిధి హర్యంకా రాజవంశ స్థాపకుడు బింబిసారునికి చెందినదనే ఆధారాలు లభ్యమయ్యాయి.

బింబిసారుడికి చాలా మంది రాణులు ఉండేవారని చెబుతారు.వారిలో ఒక రాణి బింబిసారకు చాలా సన్నిహితంగా ఉండేవారట.

ఆమె ఈ గుహలో సంపదలన్నింటినీ దాచిపెట్టారట.సోన్ భండార్ లోపలికి వెళ్లగానే మొదటగా నిధికి కాపలా కాస్తున్న సైనికుల గది ఉంటుంది దీని తరువాత నిధిని చేరుకోవడానికి ఒక మార్గం కనిపిస్తుంది.

దాని తలుపు వద్ద ఒక భారీ రాయి అడ్డుగా ఉంది.దీనిని ఇప్పటి వరకు ఎవరూ తొలగించలేకపోయారు.

శాస్త్రవేత్తలకు కూడా ఇది రహస్యంగా మిగిలిపోయింది.ఈ గుహ ద్వారం మీద ఉంచిన రాయిపై శంఖం గుర్తు ఉంటుంది.

దీనిపై తలుపు తెరిచే విధానం ఉందని చెబుతారు.దీనిని చదవడంలో విజయం సాధిస్తే నిధిని చేరుకోవచ్చంగారు.

ఈ నిధిని దక్కించుకునేందుకు బ్రిటిష్ వారు ఫిరంగితో గుహ తలుపును పగలగొట్టడానికి ప్రయత్నించినా వారు విజయం సాధించలేకపోయారు.

Mysterious Hidden Treasure In Rajgir Bihar

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube