ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 13వ తారీకు ఎన్నికలు ముగిశాయి.గతంలో ఎన్నడూ లేని విధంగా 81.86% పోలింగ్ నమోదయింది.దీంతో ఏపీలో ఎవరు గెలుస్తారు.? అన్నది ఆసక్తికరంగా మారింది.ఇదిలా ఉంటే మొన్నటి వరకు ఎన్నికల ప్రచారాలలో బిజీ బిజీగా గడిపిన వైసీపీ అధినేత సీఎం జగన్( CM Jagan ) శుక్రవారం కుటుంబ సమేతంగా విదేశీయాత్రకు బయలుదేరడం జరిగింది.
ఈ క్రమంలో శనివారం ఆయన లండన్( London ) చేరుకున్నారు.ఈనెల 31 వరకు విదేశాలలో కుటుంబంతో పర్యటించనున్నారు.లండన్, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ దేశాల్లో పర్యటించేందుకు కోర్టు అనుమతి లభించడంతో.మే 17 నుండి 31 వరకు విదేశాలలో పర్యటించి తిరిగి ఏపీకి రానున్నారు.
2024 ఏపీ ఎన్నికలలో( AP 2024 Elections ) గెలుపు విషయంలో వైయస్ జగన్ చాలా ధీమాగా ఉన్నారు.విదేశీ పర్యటనకు ముందు విజయవాడ ఐప్యాక్ కార్యాలయానికి వెళ్లి అక్కడి సిబ్బందిని కలిసి వైసీపీ పార్టీకి( YCP Party ) పనిచేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.ఆ సమయంలో 2019 ఎన్నికల ఫలితాలు కంటే అధికంగా గెలవబోతున్నట్లు దేశం మొత్తం ఏపీ చూడబోతున్నట్లు స్పష్టం చేశారు.ఇదిలా ఉంటే జగన్ రెండోసారి ప్రమాణ స్వీకార కార్యక్రమం విశాఖపట్నంలో చేయబోతున్నట్లు ముందుగానే ప్రకటించారు.
ఎన్నికల ఫలితాలు అనంతరం గెలిచిన వెంటనే జూన్ 9వ తారీకు.విశాఖపట్నంలో ఈ కార్యక్రమం నిర్వహించబోతున్నట్లు వైసీపీ పార్టీ పెద్దలు స్పష్టం చేయడం జరిగింది.