సమ్మర్ సీజన్ స్టార్ట్ అయింది.మార్చిలోనే భానుడి భగభగలు మొదలవ్వగా.
ఏప్రిల్ వచ్చే సరికి ఎండలు మరింత భయపెడుతున్నాయి.ఈ సీజన్‌లో చర్మ సౌందర్యాన్ని రక్షించుకోవడం ఎంత కష్టతరమో ప్రత్యేకంగా వివరించి చెప్పాల్సిన పని లేదు.
ఏ మాత్రం అజాగ్రత్తగా వ్యహరించినా.మొటిమలు, సన్ ట్యాన్, స్కిన్ టోన్ తగ్గిపోవడం, చర్మం కాంతిహీనంగా మారడం వంటి రకరకాల సమస్యలు ఇబ్బంది పెడతాయి.
అయితే ఈ సమస్యలకు దూరంగా ఉంటూ వేసవిలో చర్మానికి రక్షణ కల్పించాలని అనుకుంటే.అందుకు లెమన్ పీల్ సోప్ అద్భుతంగా సహాయపడుతుంది.
మరి ఈ లెమన్ పీల్ సోప్‌ను ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలి.? అసలు ఈ సోప్‌ను యూజ్ చేయడం వల్ల ఏయే ప్రయోజనాలు పొందొచ్చు.? వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా నాలుగైదు నిమ్మ పండ్లును తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి.
వాటికి ఉన్న తొక్కలను వేరు చేయాలి.ఇప్పుడు బ్లెండర్ తీసుకుని అందులో నిమ్మ తొక్కలు, ఒక కప్పు రోజ్ వాటర్ వేసి మెత్తగా గ్రౌండ్ చేసుకుని జ్యూస్‌ను సపరేట్ చేయాలి.

ఆ తర్వాత ఒక సోప్ బేస్ తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఈ ముక్కలను ఒక బౌల్‌లోకి వేసి డబుల్ బాయిలర్ మెథడ్‌లో మెల్ట్ చేసుకోవాలి.సోప్ బేస్ మెల్ట్ అవ్వగానే అందులో లెమన్ పీల్ జ్యూస్, నాలుగు చుక్కలు లెమన్ ఎసెన్షియల్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకుని సోప్ మౌల్డ్స్‌లోకి నింపుకోవాలి.ఒక రోజు పాటు వాటిని కదపకుండా వదిలేస్తే లెమన్ పీల్ సోప్ సిద్ధం అవుతుంది.

ఈ న్యాచురల్ సోప్‌ను సమ్మర్‌లో యూజ్ చేయడం వల్ల. స్కిన్ గ్లోయింగ్‌గా, స్మూత్‌గా మారుతుంది.ఆయిలీ స్కిన్ సమస్యకు దూరంగా ఉండొచ్చు.స్కిన్ టోన్ పెరుగుతుంది.అలాగే శరీరం నుండి కొందరికి బ్యాడ్ స్మెల్ వస్తుంటుంది.అలాంటి వారు ఈ లెమన్ పీల్ సోప్‌ను వాడితే ఆ సమస్య నుంచి బయటపడొచ్చు.
.