టిడిపి అధినేత చంద్రబాబు పోటీ చేసిన కుప్పం నియోజకవర్గం పై అందరికీ ఆసక్తి పెరుగుతుంది. వరుసగా ఈ నియోజకవర్గం నుంచి గెలుస్తూ వస్తున్న చంద్రబాబు ఈసారి ఎన్నికల్లో గెలుస్తారా లేదా అనేది అందరికీ టెన్షన్ పుట్టిస్తోంది.
కుప్పం నియోజకవర్గాన్ని చంద్రబాబు కంచుకోటగా మార్చుకున్నారు.అక్కడ ఎన్నికల ప్రచారం నిర్వహించకపోయినా, ప్రతి ఎన్నికల్లోను గెలుస్తూనే వస్తున్నారు.
ప్రతి ఎన్నికలలోను 50 వేలకు పైగా మెజారిటీతోనే విజయం సాధిస్తూ వస్తున్నారు.అయితే 2019 ఎన్నికల్లో మాత్రం చంద్రబాబుకు 30,000 మాత్రమే మెజారిటీ వచ్చింది.
వైసిపి అభ్యర్థి చంద్రమౌళి గట్టి పోటీనే ఇచ్చారు.ఇక ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో చంద్రమౌళి కుమారుడు భరత్ ను వైసిపి పోటీకి దించింది.
కుప్పం నియోజకవర్గ ఇన్చార్జిగా ఆయనకు ముందుగానే అవకాశం ఇచ్చి ఎమ్మెల్సీ నీ చేసింది.అలాగే నియోజకవర్గంలో అభివృద్ధికి పెద్దపీట వేసింది.
కుప్పం నగర పంచాయతీగా చేయడంతో పాటు, హంద్రీనీవా నీళ్లు తీసుకురావడం, ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు, కుప్పం నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేయడం ఇవన్నీ తమకు కలిసి వస్తాయని వైసిపి అంచనా వేస్తోంది.

చంద్రబాబుకు( Chandrababu ) గత ఎన్నికల్లో మెజారిటీ తగ్గడంతోనే కుప్పంపై వైసిపి ఆశలు పెరిగాయి.చంద్రబాబును ఎందుకు ఓడించలేము అన్న పట్టుదలకు వెళ్లి ఆయన ఓటమే లక్ష్యంగా పనిచేస్తుంది. ముఖ్యంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ( Peddireddy Ramachandra Reddy )ఈ నియోజకవర్గం పై పూర్తిస్థాయిలో ఫోకస్ చేయడం, పెద్ద ఎత్తున టిడిపి నుంచి వలసలను వైసీపీలోకి ప్రోత్సహించడం వంటివి చాలాసార్లు చేపట్టారు.
ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోను వైసిపి హవా ఇక్కడ కనిపించింది.

అప్పటి నుంచి టిడిపి గెలుపు పై ఇక్కడ అందరికీ అనుమానాలు పెరిగిపోతూనే వస్తున్నాయి.అయితే చంద్రబాబు మాత్రం ఈ నియోజకవర్గం నుంచి తప్పకుండా తానే గెలుస్తాననే ధీమా తోనే ఉన్నారు.పెద్దగా ఎన్నికల ప్రచారం కూడా చంద్రబాబు నిర్వహించలేదు.
అయితే పోలింగ్ జరిగిన తీరు మాత్రం అటు వైసీపీ , టిడిపికి టెన్షన్ పెట్టిస్తున్నాయి. పెరిగిన పోలింగ్ శాతం ఎవరికి ముప్పు తీసుకొస్తుందనే టెన్షన్ రెండు పార్టీల్లోనూ నెలకొంది.కుప్పం నియోజకవర్గంలో 2.20 లక్షల మంది ఓటర్లు ఉండగా , 89.88% మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.దీంతో పెరిగిన ఓటింగ్ శాతం ఎవరికి అనుకూలంగా మారుతుంది ఎవరికి ఓటమి తెస్తుంది అనేది రెండు పార్టీలకు టెన్షన్ పుట్టిస్తున్నాయి.