సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా పలు సినిమాలలో నటించి మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటి లయ( Laya ) ఒకరు.స్వయంవరం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
పలు సినిమాలలో హీరోయిన్ గాను అలాగే కొన్ని సినిమాలలో కీలక పాత్రలలో నటించి మెప్పించినటువంటి నయా కెరియర్ మంచి పొజిషన్లో ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకుని అమెరికా( America ) వెళ్ళిపోయారు.ఇలా అమెరికా వెళ్ళినటువంటి ఈమె కొద్ది రోజులపాటు ఐటీ ఉద్యోగం చేశారు.
అనంతరం డాన్స్ స్కూల్ కూడా నిర్వహించారు.

ఇక కరోనా సమయంలో డాన్స్ స్కూల్( Dance School ) మూసేసినటువంటి ఈమె తిరిగి ఇండస్ట్రీలోకి రావడానికి సిద్ధమవుతున్నారు.తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి లయ తన కెరియర్ గురించి కొన్ని విషయాలను వెల్లడించారు.తాను ఇండియా తిరిగి రావడానికి కారణం ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇవ్వడం కోసమేనని తెలిపారు.
ఇక ప్రస్తుతం తాను నితిన్( Nithin ) హీరోగా నటిస్తున్నటువంటి తమ్ముడు( Thammudu ) సినిమాలో నటిస్తున్నట్లు ఈమె వెల్లడించారు.

ఇక ఈ కార్యక్రమంలో భాగంగా తన వ్యక్తిగత విషయాల గురించి కూడా మాట్లాడుతూ తాను పెళ్లి చేసుకునే అమెరికా వెళ్లిపోయిన తర్వాత నా గురించి చాలామంది చాలా రకాలుగా ట్రోల్ చేశారు.నేను అమెరికాలో అడుక్కు తింటున్నానని, రోడ్డుపై పడ్డానని కామెంట్ చేశారు వీటన్నింటిని చూసినప్పుడు చాలా బాగా కలుగుతుందని తెలిపారు.అలాగే ఒక ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నటువంటి డైరెక్టర్( Director ) ఒకసారి నన్ను ఫాలో అవుతూ భయాందోళనలకు గురి చేశారని తెలిపారు.
ఆయన ఎయిర్ పోర్ట్ వరకు నన్ను ఫాలో అవుతూ వచ్చారు దాంతో నేను మీరు ఇప్పుడు నన్ను చంపుతానన్నా అడ్డుకొని వాళ్ళు ఎవరూ లేరు.మీ ఇష్టం చంపేయండి అంటూ ఎదురు తిరిగి మాట్లాడాను అంటూ అప్పటి క్లిష్ట పరిస్థితులను గుర్తు చేసుకున్నారు.