కెనడా : భారతీయ విద్యార్ధుల మెడపై బహిష్కరణ కత్తి .. ఎందుకంటే..?

ఉన్నత విద్య కోసం కెనడా( Canada ) వెళ్లిన పలువురు భారతీయ విద్యార్ధులను( Indian Students ) ఆ దేశం బహిష్కరించే అవకాశాలు కనిపిస్తున్నాయి.కెనడాలోని ప్రిన్స్ ఎడ్వర్డ్ ఐలాండ్ (పీఈఐ)( Prince Edward Island ) ప్రాంతంలో వందలాది మంది భారతీయ విద్యార్ధులు .

 Indian Students Facing Deportation In Canada Protest Against Govt Details, India-TeluguStop.com

తమను ఇక్కడే ఉండటానికి అనుమతించాలని డిమాండ్ చేస్తై నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు.గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినప్పటికీ తమకు వర్క్ పర్మిట్( Work Permit ) నిరాకరించారని.

ఇప్పుడు బహిష్కరణ చేయాలని చూస్తున్నారని వారు ఆరోపించారు.తమ డిమాండ్లు నెరవేర్చకుంటే నిరాహార దీక్షకు దిగుతామని వారు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు.

Telugu Canada, Canada Indian, Canadapm, Canada Permit, Indian, Graduate Permit,

ఏడాదిగా తాము కెనడాలోనే ఉంటున్నామని.కానీ ప్రభుత్వం రాత్రికి రాత్రే విధానాన్ని మార్చిందని నిరసనకు నేతృత్వం వహిస్తున్న రూపేందర్ సింగ్( Rupender Singh ) స్థానిక సీబీసీకి చెప్పారు.ఇతను 2019లో భారత్ నుంచి కెనడాకు వచ్చాడు.వారు తమకు తప్పుడు సమాచారం ఇస్తున్నారని.ఇది పూర్తిగా దోపిడీ అని రూపేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.విద్యార్ధుల నిరసనకు( Students Protest ) సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

షార్లెట్‌టౌన్ వీధుల గుండా విద్యార్ధులు కవాతు చేస్తూ.ఆకస్మిక విధాన మార్పులకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నారు.

అంతర్జాతీయ గ్రాడ్యుయేట్లు లేకుంటే టిమ్ హోర్టన్స్‌లో కాఫీ వంటి సేవల్లోనూ స్థానికులు ఆలస్యాన్ని ఎదుర్కొంటారని పలువురు చెబుతున్నారు.కప్పు కాఫీ అందుకోవాలంటే 20 నిమిషాలు వేచి చూడాల్సిందేనని అంటున్నారు.

Telugu Canada, Canada Indian, Canadapm, Canada Permit, Indian, Graduate Permit,

గతేడాది జూలైలో పీఈఐ నిర్దిష్ట అర్హతలు వున్న విద్యార్ధులకు పోస్ట్ గ్రాడ్యుయేట్ వర్క్ పర్మిట్‌లను( Post Graduate Work Permit ) పరిమితం చేసే చట్టాన్ని ఆమోదించింది.దీని ప్రకారం నిర్మాణ, ఆరోగ్య సంరక్షణ అర్హతలు కలిగిన విద్యార్ధులను మాత్రమే ఈ విధానానికి అంగీకరిస్తున్నారు.దీని వలన అనేక మంది అంతర్జాతీయ విద్యార్ధులు కెనడాలో పనిచేయడం కొనసాగించలేరు.ఈ ఏడాది ప్రారంభంలో కెనడాలోని మానిటోబా ప్రావిన్స్‌లోనూ ఇలాంటి ఆంక్షలు విధించబడ్డాయి.అయితే నిరసనల తర్వాత ట్రూడో ప్రభుత్వం పోస్ట్ గ్రాడ్యుయేట్ వర్క్ పర్మిట్‌లను రెండేళ్ల పాటు పొడిగించాల్సి వచ్చింది.ఇప్పుడు పీఈఐలోని విద్యార్ధులు ఇలాంటి చర్యనే డిమాండ్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube