కేవలం ఆ రెండు దేశాలు మాత్రమే న్యూక్లియర్ వార్ తట్టుకోగలవా..?

ప్రపంచంలో అణ్వాయుధాలు కలిగిన దేశాలు చాలా ఉన్నాయి.అమెరికా, భారతదేశం, పాకిస్థాన్, ఉత్తర కొరియా, రష్యా, చైనా వంటి దేశాల వద్ద ఈ భయంకరమైన ఆయుధాలు ఉన్నాయి.

 Only Those Two Countries Can Withstand A Nuclear War, Nuclear Weapons, Bombings,-TeluguStop.com

దీంతో, న్యూక్లియర్ వార్ ఎప్పుడైనా స్టార్ట్ కావచ్చనే భయం నిరంతరం నెలకొని ఉంది.ప్రస్తుతం అంతర్జాతీయ పరిస్థితులు చాలా ఉద్రిక్తంగా ఉన్నాయి.

తరచుగా బాంబు దాడులు, కాల్పులు జరుగుతున్నాయి.దీంతో అణ్వాయుధ యుద్ధం జరిగితే ఎక్కడ దాక్కుకోవాలి అనే ఆందోళన పెరుగుతోంది.

Telugu America, Annie Jacobsen, Australia, China, India, Zealand, Korea, Nuclear

అమెరికన్ పరిశోధనా జర్నలిస్ట్ అయిన ఆనీ జాకోబ్సన్(Annie Jacobsen) అణు యుద్ధం భూమిపై ఎలాంటి ప్రభావం చూపుతుందో లోతుగా అధ్యయనం చేసింది.ఆమె పరిశోధన ప్రకారం, అలాంటి భయంకర పరిస్థితుల్లో కూడా రెండు దేశాలలో మాత్రమే బతకడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.డైలీ స్టార్ న్యూస్ ప్రకారం, అణు యుద్ధం జరిగితే, మొదటి 72 గంటల్లోనే సుమారు 5 బిలియన్ల ప్రజలు మరణించే ప్రమాదం ఉంది.మిగిలిన 3 బిలియన్ల ప్రజలు కూడా అనేక కష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

Telugu America, Annie Jacobsen, Australia, China, India, Zealand, Korea, Nuclear

అణుబాంబుల దాడుల వల్ల పెద్ద ఎత్తున మంటలు వ్యాపిస్తాయి.ఈ మంటల నుంచి వెలువడే పొగ దట్టంగా ఆకాశాన్ని ఆవరించి, భూమిని చల్లబరుస్తుంది.దీనివల్ల చిన్న మంచు యుగం రావచ్చు.ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోవడం వల్ల, మిగిలిపోయిన వారు ఆహారాన్ని పండించుకోలేకపోవచ్చు.అమెరికాలోని ఐయోవా, ఉక్రెయిన్(America, Iowa, Ukraine) వంటి ప్రాంతాలు సహా మధ్య అక్షాంశాలలోని విశాల ప్రాంతాలు పదేళ్లపాటు మంచుతో కప్పబడి ఉంటాయి.

Telugu America, Annie Jacobsen, Australia, China, India, Zealand, Korea, Nuclear

జాకబ్సన్ ఒక పోడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ, ఈ విధ్వంసం వల్ల వ్యవసాయం దెబ్బతింటుందని, ఓజోన్ పొరకు తీవ్ర నష్టం జరగడం వల్ల రేడియేషన్ అనే మరో ప్రమాదం ఉందని నొక్కి చెప్పారు.సూర్యరశ్మి ప్రమాదకరంగా మారుతుంది, దీంతో మనుషులు భూమి అడుగున ఆశ్రయం పొందాల్సి ఉంటుందన్నారు.అణు యుద్ధానంతర వ్యవసాయానికి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో కొన్ని ప్రదేశాలు మాత్రమే అనుకూలంగా ఉంటాయని మిగతావన్నీ నిరుపయోగంగా మారతాయని చెప్పారు.

USAలో తాత్కాలిక ఆశ్రయం అందించే అణు బంకర్లు ఉన్నప్పటికీ, వాటి భద్రత శక్తి, ఇంధన లభ్యతపై ఆధారపడి ఉంటుందన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube