ఎన్టీఆర్ ప్రశాంత్ మూవీకి ఆ టైటిల్ ను ఫిక్స్ చేయడం కష్టమే.. ఆ కష్టాన్ని అధిగమిస్తారా?

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లలో హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ (Junior NTR ,Prashanth Neel)పేర్లు కూడా ఒకటి.గత రెండు రోజులుగా వీరి పేర్లు సోషల్ మీడియాలో మారుమగుతున్న విషయం తెలిసిందే.

 Twist For Ntr And Prashant Neel Dragon, Ntr, Prashanth Neel, Tollywood, Dragon,-TeluguStop.com

వీరిద్దరికి కాంబినేషన్లో ఒక సినిమా రాబోతున్న విషయం మనందరికీ తెలిసిందే.ఈ ప్రాజెక్టు పై ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొన్నాయి.

ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నట్లు అనుకుంటున్నట్లు వార్తలు జోరుగా వినిపించాయి.

Telugu Aswat Marimuthu, Devara, Dragon, Ntr, Prashanth Neel, Salar, Tarak, Tolly

దీంతో ఈ వార్త కాస్త అభిమానంతో ఫుల్ జోష్ ని తెచ్చింది.అయితే ఇందులో నిజానిజాల సంగతి పక్కన పెడితే ఈ వార్త మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.అంతేకాకుండా సినిమా టైటిల్ తారక్(Tarak) ఇమేజ్ కి తగ్గట్టుగా పవర్ ఫుల్ గా ఉంది అంటూ అభిమానులు కామెంట్లు వ్యక్తం చేస్తున్నారు.అయితే మైత్రి మూవీ మేకర్స్ నిర్మించబోయే ఈ భారీ చిత్రానికి సంబంధించి స్క్రిప్ట్ రెడీ అయ్యిందట కానీ ఇంకా నటీనటుల ఎంపిక కొలిక్కి రాలేదని సమాచారం.

సరే డ్రాగన్ వినేందుకు చెప్పుకునేందుకు బాగానే ఉంది కానీ దీని వెనుక ఊహించని ఒక మెలిక ఉంది.కొన్ని నెలల క్రితం తెలుగు తమిళంలో డ్రాగన్ అనే బైలింగ్వల్ మూవీ మొదలయ్యింది.

Telugu Aswat Marimuthu, Devara, Dragon, Ntr, Prashanth Neel, Salar, Tarak, Tolly

లవ్ టుడే ఫేమ్ ప్రదీప్ రంగనాధన్ హీరో.అశ్వత్ మారిముత్తు(Pradeep Ranganadhan ,Aswat Marimuthu) దర్శకుడు.ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ అయిపోయిందని రిపోర్ట్.ముందే టైటిల్ చెప్పేశారు కాబట్టి ఖచ్చితంగా రిజిస్టర్ చేసే ఉంటారు.తెలుగులో చేసుకున్నారో లేదో ఇంకా తెలియాల్సి ఉంది.ఒకవేళ చేయకపోయినా తమిళనాడు, కేరళలో డ్రాగన్ గానే రిలీజవుతుంది కాబట్టి ప్రశాంత్ నీల్ కేవలం ఒక భాషకే దాన్ని వాడుకోలేడు.

సో నిజంగా ఇదే పేరు అనుకుంటే మాత్రం ముందు అర్జెంట్ గా ఈ చిక్కును తొలగించుకోవాల్సి ఉంటుంది.ప్రస్తుతం దేవర పార్ట్ 1, వార్ 2 (Devara Part 1, War 2)షూటింగుల్లో సమాంతరంగా పాల్గొంటున్న ఎన్టీఆర్ ఆ తర్వాత చేయాల్సింది ప్రశాంత్ నీల్ మూవీనే.

అయితే ఇది ముందు మొదలవుతుందా లేక సలార్ పార్ట్ 2(Salar Part 2) శౌర్యంగ పర్వం స్టార్ట్ అవుతుందా అనే కన్ఫ్యూజన్ ఇంకా తీరలేదు.పలు మీడియాల్లో రకరకాల కథనాలు అయితే వస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube