త్వరలో తెలంగాణ క్యాబినెట్( Telangana Cabinet ) ను విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి.లోక్ సభ ఎన్నికల తరువాత పూర్తిస్థాయిలో క్యాబినెట్ ను విస్తరిస్తారనే ప్రచారం జరిగినా, అది మరి కొంత ఆలస్యం అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
అయితే తెలంగాణ క్యాబినెట్ లో ఖాళీగా ఉన్న ఆరు స్థానాలను భర్తీ చేసి జిల్లాల వారీగా క్యాబినెట్ లో ప్రాధాన్యం కల్పించాలి అనే ఆలోచనతో రేవంత్ రెడ్డి ఉన్నారు.లోక్ సభ ఎన్నికల తంతు ముగిసిన తరువాత మంత్రి పదవుల భర్తీ ఉంటుందని ముందు నుంచి ప్రచారం జరుగుతూ ఉండడంతో , మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్న నేతలు ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ మొదలుపెట్టారు.
ఎప్పటి నుంచో తాము కాంగ్రెస్ లో కీలకంగా ఉన్నామని, కష్ట కాలంలోనూ పార్టీని వీడలేదని , తమకి అవకాశం కల్పించాలంటూ సీనియర్ నేతలు కొంతమంది అధిష్టానం పెద్దల వద్ద కొంతమంది సీనియర్ నేతలు లాబియింగ్ చేస్తున్నారు.
సామాజిక వర్గ సమీకరణాల దృష్ట్యా.తమకు అవకాశం కల్పించాలని రేవంత్ రెడ్డి పై ఒత్తిడి చేస్తున్నారట.స్థానిక సంస్థల ఎన్నికల తరువాతే క్యాబినెట్ ను విస్తరించే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతుంది.
అయినా మంత్రి పదవుల విషయంలో ఎవరి స్థాయిలో వారు ప్రయత్నాలు చేశారు.ప్రస్తుతం తెలంగాణ క్యాబినెట్ లో రేవంత్ రెడ్డి( Revanth Reddy )ని కలుపుకుని 12 మంది ఉన్నారు.
మరో ఆరుగురికి ఛాన్స్ ఉంది.దీంతో జిల్లాల వారీగా , సామాజిక వర్గాల వారీగా ఆరు స్థానాలను భర్తీ చేయాల్సిన పరిస్థితి ఉంది.
ప్రస్తుతం క్యాబినెట్ లో హైదరాబాద్, రంగారెడ్డి , నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు ప్రాధాన్యం లేదు.దీంతో త్వరలో భర్తీ చేయబోయే మంత్రి పదవుల్లో ఈ జిల్లాలకు ప్రాధాన్యం ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.
హైదరాబాద్ నుంచి బీఆర్ఎస్ , కాంగ్రెస్ లో చేరిన సీనియర్ ఎమ్మెల్యేలకు మంత్రి పదవి వచ్చే అవకాశం కనిపిస్తోంది.రంగారెడ్డి జిల్లా నుంచి రామ్మోహన్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి.ఇక ఈరోజు తెలంగాణ క్యాబినెట్ సమావేశం ఉండడం తో ఈ సమావేశంలో క్యాబినెట్ విస్తరణ పై రేవంత్ రెడ్డి చర్చించే అవకాశం ఉన్నట్లుగా కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి.అయితే ఈ విషయంలో హై కమాండ్ పెద్దల సూచనలతో రేవంత్ నిర్ణయం తీసుకోనున్నారు.
ఏది ఏమైనా ఈరోజు క్యాబినెట్ సమావేశం అనంతరం మంత్రి వర్గ విస్తరణ పై ఒక క్లారిటీ రానుంది.